News Analysis: రామాలయాన్ని చూపించి ఓట్లు అడిగారు.. కేంద్రంపై బీఆర్ఎస్ నేత రాకేష్ ఫైర్!

News Analysis: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో hmtv డిబేట్‌లో బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాకేష్ చిరుమిల్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 20 July 2026 11:37 AM IST
News Analysis
X

News Analysis: రామాలయాన్ని చూపించి ఓట్లు అడిగారు.. కేంద్రంపై బీఆర్ఎస్ నేత రాకేష్ ఫైర్!

News Analysis: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యూహాలు, ప్రతిపక్షాల వైఖరిపై పొలిటికల్ డిబేట్లు హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ రాకేష్ చిరుమిల్ల పాల్గొని కేంద్ర ప్రభుత్వ పట్టుదల, దేశంలో నడుస్తున్న రాజకీయ పరిణామాలపై తీవ్రస్థాయిలో విశ్లేషించారు.

ఈసారి వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు సభను శాసించబోతున్నాయని రాకేష్ పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమర్జెన్సీ ఎలా నడిచిందో, ప్రస్తుతం దేశంలో 'బీజేపీ ఎమర్జెన్సీ' నడుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా ఐటీ దాడుల భయంతోనో, లేదా ఎంపీలను లాక్కుని (పార్టీ ఫిరాయింపులు) అయినా సరే తాము అనుకున్న బిల్లులను కేంద్రం బలవంతంగా పాస్ చేసుకుంటుందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా చట్టం తేవాలని ఆయన ఆకాంక్షించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story