News Analysis: హైకోర్టు వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు: బిఆర్ఎస్ నేత సుమిత్ర ఆనంద్!

News Analysis: హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఎం రేవంత్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అని, పేదల ఇళ్లను అక్రమంగా కూల్చడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత సుమిత్ర ఆనంద్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 28 July 2026 12:32 PM IST
News Analysis
X

News Analysis: హైకోర్టు వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు: బిఆర్ఎస్ నేత సుమిత్ర ఆనంద్!

News Analysis: హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, బాధ్యతల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం అధికారి రంగనాథ్‌కు మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీవ్ర చెంపపెట్టు అని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ వ్యాఖ్యానించారు. హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సుమారు 62 నుండి 63 సార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి, ధిక్కరణకు పాల్పడటం అనేది ఒక అధికారి సొంత నిర్ణయం కాదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వెనుకుండి నడిపించడం వల్లే ఇలా జరిగిందని ఆమె ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఒక అధికారి ఇన్నిసార్లు కోర్టు దిక్కరణకు పాల్పడడం అరుదని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story