News Analysis: జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఏమైంది?.. రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఫైర్!
News Analysis: రేవంత్ రెడ్డి సర్కార్‌కు బీజేపీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లా మారి కాపాడుతోందని బీఆర్‌ఎస్ నేత సుమిత్రా ఆనంద్ ఆరోపించారు.
News Analysis: జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఏమైంది?.. రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఫైర్!
News Analysis: తెలంగాణలో నిరుద్యోగ ఉపాధి కల్పన, రాజకీయ సమీకరణాలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. హెచ్‌ఎంటివి (hmtv) నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకురాలు సుమిత్రా ఆనంద్.. కాంగ్రెస్, బీజేపీల వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని సుమిత్రా ఆనంద్ ఆరోపించారు. ఈ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో గట్టిగా నిలదీస్తుంటే, ఆ ప్రశ్నల పరంపర సీఎంకు తగలకుండా బీజేపీ ఒక 'బుల్లెట్ ప్రూఫ్ జాకెట్'లా మారి రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ యువత పట్ల బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ సర్కార్‌ను ఎండగట్టాలి గానీ, ఇలా రక్షణగా నిలబడటం ఏంటని ఆమె ప్రశ్నించారు. కేంద్రంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన ప్రధాని మోదీ ఆ హామీని పూర్తిగా విస్మరించారని, కాబట్టి తెలంగాణ నిరుద్యోగుల తరఫున ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదన్నారు.




