BIG Debate: బీఆర్ఎస్‌పై కక్షతో రైతులను ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి: సుంకె రవిశంకర్

BIG Debate: గత ప్రభుత్వాలపై నిందలు వేసేందుకే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం నీటిని వదలడం లేదని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 14 July 2026 11:49 AM IST
BIG Debate
X

BIG Debate: బీఆర్ఎస్‌పై కక్షతో రైతులను ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి: సుంకె రవిశంకర్

BIG Debate: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న నీటి రాజకీయాలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత సుంకె రవిశంకర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'hmtv' చర్చా వేదికలో పాల్గొన్న ఆయన.. కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై నిందలు వేయాలనే ఒకే ఒక్క కుట్రతోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా రైతాంగాన్ని ఆగం చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న సాకులు అవాస్తవాలని సుంకె రవిశంకర్ కొట్టిపారేశారు. 2024లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారం, సుందిల్లా బ్యారేజీలు పనిచేస్తాయని అప్‌డేట్ చేసి, స్వయంగా మంత్రి కొండా సురేఖ సిద్దిపేటలోని రంగనాయక సాగర్ వద్ద నీటిని విడుదల చేశారని గుర్తు చేశారు. లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చామని అప్పట్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకున్నారని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story