News Alaysis: అప్పుడు రావుల పాలన.. ఇప్పుడు రెడ్డిల పాలన.. దొందూ దొందే: బీజేపీ నేత అమర్‌నాథ్ విమర్శలు
News Alaysis: తెలంగాణలో అప్పుడు రావుల పాలన జరిగితే, ఇప్పుడు రెడ్డిల పాలన సాగుతోందని, రెండు ప్రభుత్వాలు దొందూ దొందేనని బీజేపీ నేత అమర్‌నాథ్ hmtv డిబేట్‌లో తీవ్రంగా విమర్శించారు.
News Alaysis: అప్పుడు రావుల పాలన.. ఇప్పుడు రెడ్డిల పాలన.. దొందూ దొందే: బీజేపీ నేత అమర్‌నాథ్ విమర్శలు
News Alaysis: తెలంగాణలో గత బీఆర్‌ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పెద్దగా తేడా లేదని, పాలకుల పేర్లు మారినప్పటికీ పాలనా శైలి మాత్రం మారలేదని బీజేపీ సీనియర్ నాయకుడు అమర్‌నాథ్ విమర్శించారు. hmtv నిర్వహించిన డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ, గతంలో ‘రావులు’ దోచుకుంటే, ఇప్పుడు ‘రెడ్లు’ దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో మార్పు వస్తుందని, కాంగ్రెస్ వస్తుందని ప్రజలు నమ్మి మోసపోయారని, కేవలం పాలకుడు మారారే తప్ప ప్రజా పాలనలో ఎలాంటి మార్పు రాలేదని అమర్‌నాథ్ మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై బీఆర్‌ఎస్ నేతలే ఆధారాలు చూపుతున్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వారిపై ఎలాంటి విచారణ జరపకపోవడం చూస్తుంటే రెండు పార్టీల మధ్య లాలూచీ, సెటిల్‌మెంట్ రాజకీయాలు నడుస్తున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.




