News Analysis: కమిషన్ల కోసమే గురుకుల టెండర్లు.. కాంగ్రెస్ భారీ అవినీతికి తెరలేపింది: బీఆర్ఎస్ నేత ఆగ్రహం!

News Analysis: తెలంగాణలో గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

Arun Chilukuri
Published on: 3 July 2026 11:15 AM IST
News Analysis
X

News Analysis: కమిషన్ల కోసమే గురుకుల టెండర్లు.. కాంగ్రెస్ భారీ అవినీతికి తెరలేపింది: బీఆర్ఎస్ నేత ఆగ్రహం!

News Analysis: తెలంగాణలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల టెండర్ల వ్యవహారం అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధానికి దారితీసింది. గురుకుల టెండర్లలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. అవినీతిని నిరూపిస్తే రాజీనామాలకు సిద్ధమంటూ మంత్రులు సవాల్ విసరడం రాష్ట్ర రాజకీయాల్లో గన్ పార్క్, తెలంగాణ భవన్ వేదికగా తీవ్ర హైడ్రామాకు కారణమైంది. ఈ నేపథ్యంలో హెచ్ఎంటీవీ (hmtv) నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహా రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆధారాలతో సహా సంచలన ఆరోపణలు చేశారు.

డిబేట్‌లో బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు గురుకులాల సంఖ్యను 200 నుండి 1000కి పెంచామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేశారని, విద్యార్థులకు కనీసం సరైన ఆహారం, భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story