Jordar News: మళ్లీ బరితెగించిన చెడ్డి గ్యాంగ్..!
Jordar News: ప్రస్తుతం ఎండాకాలం కావడంతో చాలామంది రాత్రి వేళల్లో ఇళ్ల బయట నిద్రిస్తుంటారని, ఇలాంటి సమయంలో దొంగలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Jordar News: మళ్లీ బరితెగించిన చెడ్డి గ్యాంగ్..!
Jordar News: మందకు మందనే దిగిర్రు గదా. ఇదేం ఫ్యాంటసీనో వీళ్లకు, మీది దిక్కు మొఖం పెయ్యి కానరాకుంట అంగీలతోని, మాస్కులతోని బగ్గనే కవర్ జేశిర్రు. కనీ., కింది దిక్కే పొదుపుగ బట్టలేసుకున్నరు. శిన్నపాటి శెడ్డీలతోనే దొంగతనానికి బైలెల్లిర్రు. కుక్కలు మొర్గుతున్నా.. మనల్ని కాదన్నట్టే.. నిమ్మలంగ పోతున్నరు. మరి ఈ గ్యాంగు తిర్గుతున్నది ఎక్కడంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు కాడుల్లా. ఇగీ బుడ్డ కెమ్రాల రీలు ఇంటర్నెట్ల ఇర్గమర్గ వైరలయ్యెటాలకు.. మరి ఈల్లు ఎవలనేదాని మీద పోలీసోల్లు ప్రెస్ మీట్ వెట్టి ఇట్లనుకచ్చిర్రు.
అగో.. ఇన్నారుల్లా.. ఎస్పీ హర్షవర్ధన్ సారు ముచ్చట. మరి వాళ్లైతే ఏ గ్యాంగో తెల్వదటకనీ., ఆరుగురైతే బైటి రాష్ట్రపు దొంగలు తిర్గుతున్నరట. ఈల్ల మీద ఓ కన్నేశి ఉంచిర్రట. జప్పున్నే దొర్కవడ్తమని జెప్తున్నరుకనీ., జనాలూ.. అస్సల్కే ఎండాకాలం సల్లగుందని బైట పండుకుంటె, దొంగగాల్లతోని పర్శానుంటది మరి. ఏమైతది తియ్యనుకుంటె ఆగమైతది మరి. పోలీసోల్లే పట్టుకుంటరని, చిల్ల్ గాకుంట.. కొత్తోల్లత్తె ఎర్కవట్టి పోలీసోల్లకు మత్లావ్ పంపుర్రి. ఏమంటున్నం. సరేనా.




