Jordar News: తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపిన చంద్రబాబు

Jordar News: పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబు సైకిల్ యాత్ర. పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చిన చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2026 7:12 AM IST
Jordar News
X

Jordar News: తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపిన చంద్రబాబు

Jordar News: వైసు మీద వడ్డా తగ్గేదేలే అన్నట్టే జేస్తున్నడు గదా సీఎం చంద్రబాబు సారు. ఇయ్యాల ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావట్టి., విశాఖపట్నంల ఏర్పాటు జేశ్న కార్యక్రమాల్ల పాల్గొనేతందుకు పొయ్యిండు. విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్‌ దాంక సీఎం సారు సైకిల్ సవారీ చేశిండిట్ల. టక్కటక్క సైకిల్ తొక్కుకుంట ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లనే చేరుకుని. అక్కడున్నోళ్లందరి లోపట జోష్ నింపిండు.

ఓదిక్కు ఎర్రటి ఎండ దంచుతున్నా గుడ ఎన్కకు పొయ్యేదేలే అన్నట్టే జేశిండిట్ల. సీఎం సారు ఎంట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గుడ సైకిల్ సవ్వారి జేశిర్రు. ఇగిట్ల సైకిల్ తొక్కుకుంటనే దారి పొంటున్న జనాలకు శెయ్యూపి వాళ్లను ఖుషీ జేశిండు. మొత్తానికైతే అటు పర్యావరణాన్ని కాపాడటానికి పిట్రోల్, డీజిల్ వాడ్కం తగ్గిచ్చి సైకిల్ తొక్కాల్నని జెప్పుకుంటనే ఆళ్ల పార్టీ గుర్తు సైకిల్ ని జనాల్ల గట్టిగ నాటుకపొయ్యేతట్టు జేశిండు చంద్రబాబు సారు. కనీ., చంద్రబాబు సారుకు వైసు ఎంత వెరిగినా పడ్సోల్లతోని పోటీవడుకుంట రోజురోజుకు ఇంకింత ఉశారుగనే కానస్తున్నడు.

ఏ కార్యక్రమం జరిగినా అస్సల్కే నెరివడకుంట యువకుని లెక్కన్నే పాల్గొని తెలుగు తమ్ముళ్లలోపట ఇంకింత జోష్ పెంచుతున్నడు. ఇగాడ వెట్టిన మీటింగుల గిట్ల మాట్లాడిండు మరిగ చంద్రబాబు సారు జెప్పిన బాటల్నే తెలుగు తమ్ముళ్లంత నడ్శి ఈకాడి కెంచి సైకిల్ మీద శిన్న శిన్న ప్రయాణాలు జేస్తరో., లేకుంటె ఆ నినాదాన్ని ఒక్కరోజుకే పరిమితం జేస్తరో సూడాలె ఇగ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story