సక్సెస్ స్కూల్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలి: బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ డిమాండ్!
సైదాబాద్ సక్సెస్ స్కూల్‌లో హిందూ విద్యార్థి చేత కల్మా చదివించిన ఘటనపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తీవ్రంగా మండిపడ్డారు.
సక్సెస్ స్కూల్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయాలి: బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ డిమాండ్!
సైదాబాద్ సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థి డైరీలో కల్మా రాయించిన ఘటనపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
"మన స్కూళ్లలో ముస్లిం పిల్లలకు భగవద్గీత నేర్పిస్తే ఊరుకుంటారా? అప్పుడు ఓవైసీ, ఆయన చంచగాళ్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రంగంలోకి దిగుతారు కదా" అంటూ చీకోటి ప్రవీణ్ ప్రశ్నించారు. పసిపిల్లల మనసుల్లో విషం నింపేలా, వారిని వేరే మతం వైపు మళ్లించేలా కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
Next Story




