Burning Topic: ఎలాన్ మస్క్ మీద చైనా నిఘా?

Burning Topic: అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 May 2026 7:12 AM IST
Burning Topic
X

Burning Topic: ఎలాన్ మస్క్ మీద చైనా నిఘా?

Burning Topic: ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటనకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార, సాంకేతిక రంగాల సీఈఓలను తనతో పాటు తీసుకెళ్లారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక వివాదాల పరిష్కారం కోసం ఈ వ్యాపార ప్రముఖుల బృందం వెళ్లింది. వీరిలో ఎలామ్ మస్క్, టిమ్ కుక్, జెన్సన్ హువాంగ్‌, సంజయ్ మల్హోత్రా, క్రిస్టియానో అమోస్, జిమ్ ఆండర్సన్ తదితరులు ఉన్నారు. వీరందరిలోకెళ్లా టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రత్యేకంగా కనిపించారు. మస్క్ తన వెంట ఆరేళ్ల కుమారుడు 'ఎక్స్'ను కూడా వెంట తీసుకెళ్లాడు. అతని చేతిలోని డ్రాగన్ ఆకారపు బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పర్యటనలో మస్క్ అందరు వ్యాపార దిగ్గజాల తరహాలో కాకుండా సాధారణ పర్యటకుని తరహాలో సెల్ఫీలు తీసుకోవడం అందరినీ ఆకర్శించింది. డొనాల్డ్ ట్రంప్‌ గౌరవార్థం చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక విందు ఇచ్చింది. ఇందులో ఎలాన్ మస్క్ ఇతర అమెరికా వ్యాపార దిగ్గజాలు కూడా పాల్గొన్నారు.

ఈ విందులో ఎలాన్ మస్క్‌లో సెల్ఫీలు దిగేందుకు చైనా వ్యాపారవేత్తలు ఆసక్తి చూపించారు. కాగా మస్క్ కూర్చున్న టేబుల్ దగ్గర ఎర్రటి దుస్తుల్లోని ఓ వెయిట్రెస్ చాలా సేపు నిలబడి ఉండటం కనిపించింది. ఈ విందులో ఆమె ప్రత్యేక ఆకర్శనగా మారింది. ఎలాన్ మస్క్‌ను పలకరించడంతో పాటు ఆహార పానీయాలు సర్వ్ చేసింది. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఆమె వెయిట్రెస్‌ ఒక గూఢచారి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రముఖ ఇండిపెండెంట్ బ్లాగర్ జెన్నిఫర్‌ జెంగ్‌ బయటపెట్టారు. ఆ మహిళ పేరు చెంగ్‌ చెంగ్‌.. చైనా సైన్యంలో ఆమె బెటాలియన్‌ కమాండర్‌గా వ్యవహరిస్తోంది. చెంగ్‌ చెంగ్ మిలటరీ యూనిఫామ్‌తో ఉన్న వీడియోలు, ఫోటోలను కూడా బయట పెట్టింది జెన్నిఫర్‌. అంతే కాదు చెంగ్ చెంగ్ తన ఎర్రటి దుస్తుల కింద తుపాకీ లేదా అలాంటిదేదో దాచి ఉంచారని నేను అనుకుంటున్నాను అంటూ సైలెంట్‌గా బాంబు పేల్చింది జెన్నిఫర్‌ జెంగ్‌. ఈ షాకింగ్ న్యూస్ అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది

విదేశాల నుంచి వచ్చే ప్రమఖ నాయకులు, అధికారులు, వ్యాపార దిగ్గజాలపై చైనా తన సైనికాధికారులతో నిఘా పెడుతుందని జెన్నిఫర్‌ జెంగ్‌ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బీజింగ్‌లో పర్యటించినప్పుడు చెంగ్‌ చెంగ్‌‌ను రంగంలోకి దింపడం ద్వారా ఇదే పని చేసిందని అంటున్నారు. కాగా విదేశాలపై చైనా ప్రభుత్వం గూఢచర్యం, అనేక కుట్రలకు పాల్పడుతోందని జెన్నిఫర్‌ జెంగ్‌ గతంలోనూ చాలాసార్లు గుప్పించారు.2023లో కెనడాలో ఖలిస్తాన్‌ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురికావడం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అంతం చేసి పరారయ్యారు. అయితే, హత్య వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉన్నట్లు జెన్నిఫర్‌ జెంగ్‌ ఆరోపించారు. నిజ్జర్‌ను హత్య చేసి ఆ నిందను భారత్‌పైకి నెట్టేశారని తెలిపారు. భారత్‌కు, ఇతర దేశాల మధ్య విబేధాలు పెంచడం చైనా అసలు లక్ష్యమని ఆమె అంటున్నారు. కాగా జెన్నిఫర్‌ జెంగ్‌ చేసిన ఈ ఆరోపణలపై చైనా ప్రభుత్వం ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.

ఇంతకీ చైనా ఎలాన్ మస్క్‌ మీద ఎందుకు నిఘా పెట్టినట్లు? ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్, స్టార్ లింక్ సాంకేతిక సామ్రాజ్యాలు అమెరికా రక్షణ రంగానికి వెన్నెముకగా ఉన్నాయి. దీంతో ఆయన్ని తమ జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తోంది చైనా. మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ తమ భూభాగాలపై కూడా నిఘా పెట్టగలదని చైనా మిలిటరీ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న స్పేస్‌ ఎక్స్ శాటిలైట్ ప్రయోగాలు అమెరికా అంతరిక్ష రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఎలాన్ మస్క్ అమెరికా ప్రభుత్వానికి అతి దగ్గర పని చేస్తున్నారు. ట్రంప్‌తో పాటు చైనాకు రావడం చైనా అధికారులకు ఆందోళన కలిగించింది. అమెరికా వ్యూహాలు, సాంకేతిక ఒప్పందాలను తెలుసుకోవడానికే చైనా ఎలాన్ మస్క్‌ను టార్గెట్ చేసిందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ప్రతీ కదలికనూ నిషితంగా గమనించారు

ఎలాన్ మస్క్‌ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారం గురుంచి తెలిసిందే.. అయితే టెస్లా చైనాలోని స్థానిక ఎలక్ట్రిక్ వాహన కంపెనీల నుండి వస్తున్న గట్టి పోటీ ఎదుర్కొంటోంది. అక్కడి బీవైడీ, ఎక్స్‌పెంగ్, నియో కార్ల కంపెనీలు టెస్లా కన్నా తక్కువ ధరలకే సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. టెస్లా తన పాత మోడళ్లైన మోడల్ 3, మోడల్ Y లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ తీవ్ర పోటీ వల్ల కొన్నాళ్లుగా టెస్లా అమ్మకాలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మరోవైపు టెస్లా కార్లతో తమ జాతీయ భద్రతకు ముప్పు ఉందని చైనా భావిస్తోంది.చైనాలో లక్షలాది టెస్లా కార్లు తిరుగుతున్నాయి. ఈ కార్లలోని కెమెరాలు, సెన్సార్లు సేకరించే సమాచారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లొకేషన్ డేటా అమెరికా చేతికి చిక్కుతుందేమోనని చైనాకు మొదటి నుంచీ అనుమానం ఉంది. అందుకే చైనా సైనిక ప్రాంతాల్లో ఇప్పటికే టెస్లా కార్లను నిషేధించారు. అయితే చైనాలో గూఢచర్యం కోసం టెస్లా కార్లను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలను ఎలాన్ మస్క్ ఖండించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story