Jordar Varthalu: ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు.. ప్రారంభోత్సవాలకు వస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి


Jordar Varthalu: ఆదిలాబాద్ జిల్లాపై వరాల జల్లు.. ప్రారంభోత్సవాలకు వస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి
Jordar Varthalu: అదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విశేషాలు! బాసర అమ్మవారి ఆలయ అభివృద్ధికి 225 కోట్లు.
Jordar Varthalu: మన అదిలాబాద్ జిల్లాకు ఇగ మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అదిలాబాద్ గడ్డపై అడుగుపెట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా, వరాల జల్లు కురిపించిండు. బాసర అమ్మవారి సాక్షిగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రేవంతన్న మాటిచ్చిండు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ 225 కోట్ల రూపాయలు కేటాయించింది కదా.. ఇగ ఆ పనులకు సీఎం రేవంత్ రెడ్డి సార్ భూమి పూజ చేసిండు. అంతకంటే ముందు తన మనవడికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించి మొక్కులు చెల్లించుకున్నాడు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధిలో భాగంగా గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తామని వేదిక మీదనే నిర్ణయం తీసుకున్నాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

