News Analysis: హరీష్ రావు శిష్యుడే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

News Analysis: తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ విమర్శల పదును పెరుగుతోంది.

Arun Chilukuri
Published on: 9 July 2026 11:46 AM IST
News Analysis
X

News Analysis: హరీష్ రావు శిష్యుడే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

News Analysis: తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకూ విమర్శల పదును పెరుగుతోంది. ఒకవైపు హరీష్ రావు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండగా.. దానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ సరికొత్త రాజకీయ బాంబు పేల్చింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ఒకప్పుడు శిష్యుడిగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ నాయకుడు దిలీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

హెచ్‌ఎంటీవీ ప్రత్యేక విశ్లేషణలో బీఆర్ఎస్ నేత దిలీప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ విమర్శలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని, హరీష్ రావుతో ఆయనకున్న పాత పరిచయాలను ప్రస్తావిస్తూ.. రేవంత్ రెడ్డికి రాజకీయ వ్యూహాలు, పట్టువిడుపులు నేర్పింది హరీష్ రావుయేనని, ఆ రకంగా రేవంత్ ఆయనకు శిష్యుడేనని వ్యాఖ్యానించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story