News Analysis: సీఎం రేవంత్ పర్యటనకు కేంద్రం 'నో': బీజేపీ తీవ్ర ఆరోపణలు!

News Analysis: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంపై పొలిటికల్ డిబేట్. బీజేపీ నేత వెంకట్ రెడ్డి ఆరోపణలు, కాంగ్రెస్ ప్రత్యారోపణలపై న్యూస్ విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 24 Aug 2026 11:03 AM IST
News Analysis
X

News Analysis: సీఎం రేవంత్ పర్యటనకు కేంద్రం 'నో': బీజేపీ తీవ్ర ఆరోపణలు!

News Analysis: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా (US) పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య ఈ అంశంపై పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై hmtv లో నిర్వహించిన ప్రత్యేక రాజకీయ విశ్లేషణ చర్చలో ప్రతినిధులు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రికి లేని ఆంక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు విధించారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పర్యటనకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

చర్చలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి లాంటి విఐపీలు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు నిర్దిష్ట దౌత్య ప్రోటోకాల్స్, సభా మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ (MEA) దేశ భద్రత, దౌత్య సంబంధాలు, విదేశాల్లో కలవబోయే వ్యక్తుల వివరాలను పరిశీలించిన తర్వాతే అనుమతి ఇస్తుందని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story