Burning Topic: సీఎం విజయ్ 'ముల్లివైక్కల్' ట్వీట్ రచ్చ.. మానిపోయిన గాయాలను కెలికారా?
Burning Topic: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
Burning Topic: సీఎం విజయ్ 'ముల్లివైక్కల్' ట్వీట్ రచ్చ.. మానిపోయిన గాయాలను కెలికారా?
Burning Topic: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రస్థానానికి వచ్చి కోట్లాది మంది యువ ప్రేక్షకుల మనసులను చూరగొన్న విజయ్, సొంతంగా రాజకీయ పార్టీ ఎన్నికల్లో విజయం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచీ ప్రతి రోజూ ఏదో పని చేసి వార్తల్లో కనిపించడం అలవాటుగా మారింది. తాజాగా ఆయన చేసిన పని అత్యంత వివాదాస్పదంగా మారింది. సీఎం విజయ్ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపింది. 'ముల్లివైక్కల్' సంస్మరణ దినోత్సవం సందర్భంగా భావోద్వేగంతో నివాళులర్పించారు. మిమ్మల్ని మేం మా మనసుల్లోనే నిలుపుకుంటాం. సముద్రాలు దాటి జీవిస్తున్న మా తమిళ సోదరుల హక్కుల కోసం మేం ఎల్లప్పుడూ అండగా ఉంటాం'' అని అందులో తెలిపారు. ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. ఏకంగా దానికి 10 లక్షలకుపైగా వ్యూస్ రాగా, మరో 10వేల మందికిపైగా రీట్వీట్ చేశారు. విజయ్ మానిపోతున్న గాయాలను ఎందుకు కెలికారు? ఆయన అన్నీ తెలిసే ఈ పని చేశారా? దీని వెనుక ఎవరి ప్రోద్భలం ఉంది అనే చర్చ మొదలైంది.
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం.. ఈ సంస్థ సంక్షిప్త నామం ఎల్‌టీటీఈ. శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రావిన్స్‌లోని తమిళుల కోసం తమిళ ఈలం అనే ప్రత్యేక దేశం ఏర్పాటే ఈ సంస్థ లక్ష్యం. వేలుపిళ్లై ప్రభాకరన్ 1976లో ఏర్పాటుచేసిన వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ ఇది. శ్రీలంక సింహళీయులు ఆధిపత్యం కలిగిన ప్రభుత్వం చేతిలో శ్రీలంక తమిళులు వివక్ష, హింసను ఎదుర్కొంటున్నారని ఎల్‌టీటీఈ ఆరోపణ భాష, విద్య, ఉద్యోగాల్లో వివక్షకు వ్యతిరేకంగా శాంతియుతంగా మొదలైన ఈ ఉద్యమం, కాలక్రమేణా ప్రత్యేక దేశం కోసం పోరాటంగా మారింది. వేలాది మంది సైనికులతో, సొంత నౌకాదళం, విమాన విభాగంతో ఇది ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. లంక ప్రభుత్వానికి, ఎల్‌టిటిఇకి మధ్య దశాబ్దాల పాటు భీకర అంతర్యుద్ధం జరిగింది. 26 ఏళ్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో దాదాపు లక్షమంది మరణించారని అంచనా.
ఎల్‌టీటీఈకి భారతదేశంలో కూడా వివాదాస్పద చరిత్ర ఉంది. ఈ సంస్థ ప్రతిపాదించిన ఈలంలో తమిళనాడును కూడా భాగం చేయాలనే డిమాండ్ కూడా ఉండేది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎల్‌టీటీఈని అదుపు చేసి శ్రీలంకలో శాంతిని సాధించేందుకు భారత సైన్యాన్ని పంపారు. దీంతో ప్రభాకరన్ ఆగ్రహించారు. దీంతో 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఎల్‌టీటీఈని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ భారత్ మొదటిసారిగా నిషేధం విధించింది. అప్పుడు తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేశారు. ఆ తర్వాత లంక ప్రభుత్వం సుదీర్ఘ అంతర్యుద్ధంలో ఎల్‌టీటీఈని నిర్మూలించారు. ప్రభాకరన్ మే 18, 2009న ముల్లివైకల్ తీరంలో శ్రీలంక సైన్యం చేతిలో మరణించారు. ముల్లివైక్కల్‌లో జరిగిన ఘర్షణలో దాదాపు 40,000 మందికిపైగా శ్రీలంక తమిళ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ప్రపంచవ్యాప్త తమిళులు ఒక పెద్ద మారణహోమంగా భావిస్తారు.
ముల్లివైక్కల్‌లో జరిగిన ఘర్షణను ప్రపంచవ్యాప్త తమిళులు ఒక పెద్ద మారణహోమంగా భావిస్తారు. చనిపోయిన తమ తోటి తమిళులకు నివాళులు అర్పించడానికి మే 18ని ముల్లివైక్కల్ సంస్మరణ దినోత్సవంగా వారు పాటిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం విజయ్ వారికి నివాళులు అర్పిస్తూ చేసిన ట్వీట్ కాస్తా వివాదంగా మారింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చంపిన ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడిని విజయ్ కీర్తించడాన్ని బీజేపీ తప్పు పట్టింది. ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొనసాగుతోంది. స్వయాన రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు స్పందించం లేదని బీజేపీ జాతీయ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. మరోవైపు రాజీవ్ గాంధీని దారుణంగా పొట్టనబెట్టుకున్న ఎల్‌టీటీఈ త్యాగాల సెంటిమెంట్‌ను విజయ్ నెత్తిన పెట్టుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రభుత్వానికి ఎలా మద్దతు ఇస్తుందని డీఎంకే ప్రశ్నిస్తోంది
కేవలం తమిళ జాతీయవాద ఓట్లను ఆకర్షించడానికే విజయ్ ఇలాంటి భావోద్వేగ అంశాలను వాడుకుంటున్నారని విమర్శలున్నాయి. ద్రవిడ వాదం, తమిళ జాతీయవాదం రెండూ తనకు రెండు కళ్లలాంటివి అంటూ ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం చేశారు. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నా డీఎంకేల మీద పై చేయి సాధించేందుకే టీవీకే ఇందుకు తమిళ జాతీయవాదాన్ని కూడా భుజాలపైకి ఎత్తుకుందనే విమర్శలు ఉన్నాయి. తమిళ జాతీయవాదం అనేది తమిళ భాష, తమిళ సంస్కృతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల హక్కుల చుట్టూ తిరుగుతుంది. శ్రీలంక, భారత దేశంలో ఎల్‌టీటీఈ ఉనికిని కోల్పోయినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులతో ఇప్పటికీ ఈలం ఆకాంక్ష బలంగా ఉంది. అందుకే శ్రీలంకలో అమాయక తమిళులపై జరిగిన మారణహోమాన్ని టీవీకే అధినేత, సీఎం విజయ్ గుర్తు చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.




