Big Debate: మరో ఉద్యమానికి కాక్రోచ్ పార్టీ సిద్ధం.. రాజకీయ రంగప్రవేశంపై హెచ్‌ఎమ్‌టీవీ విశ్లేషణ!

Big Debate: ఢిల్లీ నిరసనల అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తదుపరి కార్యాచరణపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్ నిర్వహించింది.

Arun Chilukuri
Published on: 7 Aug 2026 11:14 AM IST
Big Debate
X

Big Debate: మరో ఉద్యమానికి కాక్రోచ్ పార్టీ సిద్ధం.. రాజకీయ రంగప్రవేశంపై హెచ్‌ఎమ్‌టీవీ విశ్లేషణ!

Big Debate: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనల్లో పాక్షిక విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భవిష్యత్ ప్రణాళికలు మరియు రాజకీయ పురోగతిపై హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) ప్రత్యేక ‘బిగ్ డిబేట్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. సీజేపీ కోర్ గ్రూప్ దాదాపు 15 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి తదుపరి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేసింది.

ముందుగా ప్రజల అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. దేశంలో 65 శాతం మంది ఉన్న 35 ఏళ్ల లోపు యువత ఎదుర్కొంటున్న తీవ్ర నిరుద్యోగం, నాణ్యమైన విద్య భారం కావడం, సామాజిక న్యాయం వంటి ప్రధాన ఆచరణాత్మక అంశాలపైనే ఈ పార్టీ ప్రధానంగా దృష్టి సారించిందని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story