News Analysis: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: బచ్చు శ్రీనివాస్

News Analysis: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అభివృద్ధి పేరుతో సాగుతున్న పీడన అని బీఆర్ఎస్ నేత బచ్చు శ్రీనివాస్ విమర్శించారు.

Arun Chilukuri
Published on: 5 Sept 2026 12:27 PM IST
News Analysis
X

News Analysis: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: బచ్చు శ్రీనివాస్

News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చు శ్రీనివాస్ పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది పాలన కాదని పీడనగా మారిందని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని బచ్చు శ్రీనివాస్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనపై అవాస్తవాలు మాట్లాడుతూ కాలయాపన చేయడం మినహా ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, పెరిగిన క్రైమ్ రేట్, అభివృద్ధి పనుల మందగమనాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పాలనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story