Big Debate: యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు.. ఇది ప్రజల కోసమా లేక రాజకీయాల కోసమా?

Big Debate: యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ప్రజల కోసమా లేక రాజకీయాల కోసమా అని కాంగ్రెస్ నేత బాజీ ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 16 Sept 2026 12:10 PM IST
Big Debate
X

Big Debate: యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు.. ఇది ప్రజల కోసమా లేక రాజకీయాల కోసమా?

Big Debate: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుపై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొన్న నేత బాజీ కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి ఎన్నికల ముందు బీజేపీ ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చి, దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ఈ రాజకీయ క్రీడ ఆడుతోందని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే UCC అంశాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మతపరమైన, రాజ్యాంగ పరమైన అంశాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు.

ఉత్తరాఖండ్‌లో UCC అమలులో భాగంగా ఎస్టీలకు మినహాయింపు ఇచ్చారని, అలాగే లివింగ్ రిలేషన్‌షిప్‌లను రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన తెచ్చి సివిల్ సొసైటీ నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారని గుర్తుచేశారు.

కేవలం ముస్లిం పర్సనల్ లాను మాత్రమే టార్గెట్ చేస్తూ, ఇస్లామిక్ చట్టాలు మరియు ఆచారాలపై అవగాహన లేకుండా బీజేపీ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా ప్రజలతో బహిరంగ చర్చ పెట్టి, ప్రజామోదం పొందిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.