BIG Debate: సమాధానం చెప్పలేక సభ నుంచి వెళ్లిపోయారు: కాంగ్రెస్ నేత బాజీ

BIG Debate: ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయారని కాంగ్రెస్ నాయకుడు బాజీ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 14 Aug 2026 11:42 AM IST
BIG Debate
X

BIG Debate: సమాధానం చెప్పలేక సభ నుంచి వెళ్లిపోయారు: కాంగ్రెస్ నేత బాజీ

BIG Debate: పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అడిగిన కీలక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారని కాంగ్రెస్ నాయకుడు బాజీ తీవ్రంగా విమర్శించారు. hmtv 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్లమెంట్ సమావేశాల ఆఖరి రోజున కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగట్టారు.

కేంద్రంలో పూర్తి అధికార మెజారిటీ ఉండి కూడా ప్రతిపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని బాజీ మండిపడ్డారు. "సభలో చర్చ జరగకుండా కేవలం 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలోనే 11 కీలక బిల్లులను ఏకపక్షంగా ఎలా ఆమోదింపజేసుకున్నారు?" అని ఆయన ప్రశ్నించారు. "ప్రతిపక్షం చర్చకు సహకరించడం లేదనడం పూర్తిగా వాస్తవ దూరం. మేమే సమస్యల గురించి చర్చించమని డిమాండ్ చేస్తున్నాం" అని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story