Off The Record: భార్గవ్ దేశ్ పాండేకు కేటీఆర్ బంపర్ ఆఫర్..!
Off The Record: ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత భార్గవ్ దేశ్‌పాండే త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 12న కండువా కప్పుకోనున్న భార్గవ్.
Off The Record: భార్గవ్ దేశ్ పాండేకు కేటీఆర్ బంపర్ ఆఫర్..!
Off The Record: ఆదిలాబాద్ హస్తం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న భార్గవ్ దేశ్‌పాండేపై.. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసింది. కుటుంబపరంగా తాత స్వర్గీయ విఠల్ రావు దేశ్‌పాండే నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న భార్గవ్ అతిచిన్న పిన్నవయసులోనే రాష్ట్ర స్థాయిలో యూత్ కాంగ్రెస్ నేతగా ఎదిగారు. అంతేకాకుండా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
2011లో ఆదిలాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించగా చిన్నవయసుల్లో వద్దని వారించి అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ టికెట్ దక్కించుకుని పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు భార్గావ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పార్టీ కోసం పనిచేసే వారికే ఇవ్వాలని ధిక్కార స్వరం వినిపించారు. అధికారంలో లేని సమయంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చిన భార్గవ్‌పై ఎన్నికల అనంతరం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దాదాపు మూడేళ్ళుగా సైలెంట్ మోడ్‌లో ఉన్న భార్గవ్.. పార్టీ నేతలపై కాని, పార్టీపై కానీ ఏనాడూ అసంతృప్తి వెలిబుచ్చలేదు. పైగా ఏరోజైనా పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని ఎదురు చూస్తూ వచ్చారు.
భార్గవ్ అనుచరులు, మద్దతుదారులు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తేవడంతో గత వారం రోజుల క్రితం ఆదిలాబాద్ చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ను స్వయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భార్గావ్‌ను గులాబీ పార్టీలోకి రావాలని కేటీఆర్ ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 12న హైదరాబాద్‌లో గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు చెబుతున్నారు. అనంతరం ఈ నెలాఖరులో ఆదిలాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, కుంతియా, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కా, వి.హనుమంతరావు తదితర నేతలతో భార్గవ్‌కు మంచి పరిచయాలు ఉన్నాయని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వస్తుందని ఇంతకాలం ఎదురుచూసినా ఫలితం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కారులో షికారుకు భార్గవ్ రెడీ అయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే భార్గవ్ చేరికతో గులాబీ దళం మరింత బలోపేతం అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భార్గవ్‌తోపాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకుంటారని టాక్
ఇన్నాళ్లూ ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీని నడిపిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్నకు గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పటికే పార్టీని కాపాడుతూ వస్తున్నారు. అయితే భార్గవ్ బేషరతుగా కారులో షికారుడు రెడీ అవుతున్నప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనపైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే రామన్న, భార్గవ్ వేర్వేరు చోట్ల ఎమ్మెల్యే బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయి.




