BIG Debate: సభను అవమానించి బీఆర్‌ఎస్‌ నేతలు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయడం లేదు: కాంగ్రెస్ నేత గౌరీ సతీష్ ఫైర్

BIG Debate: అసెంబ్లీ పరిణామాలు, స్పీకర్‌పై వ్యాఖ్యలపై హెచ్‌ఎంటివి డిబేట్‌లో కాంగ్రెస్ నేత గౌరీ సతీష్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Arun Chilukuri
Published on: 9 Sept 2026 11:33 AM IST
BIG Debate
X

BIG Debate: సభను అవమానించి బీఆర్‌ఎస్‌ నేతలు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయడం లేదు: కాంగ్రెస్ నేత గౌరీ సతీష్ ఫైర్

BIG Debate: తెలంగాణ శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలు, స్పీకర్‌పై జరిగిన వ్యాఖ్యలు మరియు అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తతలపై హెచ్‌ఎంటివి డిబేట్‌లో కాంగ్రెస్ ప్రతినిధి గౌరీ సతీష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో స్పీకర్‌ను కించపరిచేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్‌ నేతలు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయడం లేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా మాట్లాడిన తీరును ఎవరూ హర్షించరని పేర్కొన్నారు. ఇక మహిళా ఎమ్మెల్యేల ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ బీఆర్‌ఎస్‌ మాత్రం సభను సద్వినియోగం చేసుకోకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story