News Analysis: రూ. 1.50 లక్షల కోట్ల భూములు కాపాడింది హైడ్రా కాదా?: ఇందిరా శోభన్ ప్రశ్న!
News Analysis: హైడ్రా (HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై, విపక్షాల విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ఘాటుగా స్పందించారు.
News Analysis: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై, విపక్షాల విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ఘాటుగా స్పందించారు. హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఇందిరా శోభన్.. హైదరాబాద్ భవిష్యత్తును, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా 'హైడ్రా'ను తీసుకువచ్చారని, అయితే దీని చర్యలను తట్టుకోలేక కొందరు బడా ఆక్రమణదారులు పేద ప్రజలను ముందుకు నెట్టి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.
హైడ్రా వ్యవస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు లక్షా 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను, చెరువులను, పార్కులను కాపాడిందని గుర్తు చేశారు. అంబర్‌పేటలోని 5 ఎకరాల బతుకమ్మ కుంట, కూకట్‌పల్లిలోని 29.58 ఎకరాల నల్ల చెరువు, తుమ్మడికుంట, పాతబస్తీలోని బంరుక్స్ ఉద్దు వంటి చెరువులను ఆక్రమణదారుల నుంచి విడిపించి తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత హైడ్రాదేనని స్పష్టం చేశారు.




