News Analysis: దివ్యాంగులు, వితంతువులకే ఫస్ట్ ప్రయారిటీ.. 2 లక్షల పెన్షన్లపై క్లారిటీ!
News Analysis: బీఆర్‌ఎస్ హయాంలో మోసపోయిన నిరుద్యోగులు, అర్హులకు రేవంత్ సర్కార్ న్యాయం చేస్తుందని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ అన్నారు.
News Analysis: దివ్యాంగులు, వితంతువులకే ఫస్ట్ ప్రయారిటీ.. 2 లక్షల పెన్షన్లపై క్లారిటీ!
News Analysis: తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేని ఎన్నో ప్రజా సంక్షేమ పనులను ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ విజయవంతంగా చేసి చూపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ స్పష్టం చేశారు. హెచ్‌ఎంటివి (hmtv) 'న్యూస్ అనాలిసిస్' చర్చా వేదికలో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ, నిరుద్యోగ సమస్యలు మరియు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై కీలక ప్రకటన చేశారు.
ఈ చర్చా కార్యక్రమంలో మెదక్ జిల్లాకు చెందిన 1969 తెలంగాణ ఉద్యమకారుడు యేసురెడ్డి అనే వృద్ధుడు లైవ్‌లోకి వచ్చి తన ఆవేదనను పంచుకున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం తనను కనీసం గుర్తించలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డికి తాను లేఖ రాయగానే తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్‌కు విచారణ నిమిత్తం ఆదేశాలు పంపారని పేర్కొన్నారు. దీనిపై ఇందిరా శోభన్ హర్షం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. "ఉద్యమంలో దెబ్బలు తిన్న వారిని కేసీఆర్ విస్మరిస్తే, సీఎం రేవంత్ రెడ్డి వారిని గౌరవిస్తున్నారు. హెచ్‌ఎంటివి సాక్షిగా ఆ వృద్ధుడి పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. మెదక్ కలెక్టర్‌తో స్వయంగా మాట్లాడి టెక్నికల్ సమస్యలను తొలగించి ఆయనకు పెన్షన్ అందేలా చూస్తాం" అని హామీ ఇచ్చారు.




