News Analysis: కాళేశ్వరంపై బీఆర్ఎస్ డ్రామాలు.. 2027 జులైకల్లా సిద్ధం: మానవతా రాయ్

News Analysis: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదలపై కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Arun Chilukuri
Published on: 14 July 2026 11:12 AM IST
News Analysis
X

News Analysis: కాళేశ్వరంపై బీఆర్ఎస్ డ్రామాలు.. 2027 జులైకల్లా సిద్ధం: మానవతా రాయ్

News Analysis: తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, పోలవరం మరియు బనకచర్ల జలాలకు సంబంధించిన నీటి పంచాయితీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఒకవైపు ప్రాజెక్టుల నిర్వహణపై విమర్శలు, మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ల తిరస్కరణ వంటి పరిణామాల మధ్య 'hmtv' నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతా రాయ్ పాల్గొని బీఆర్ఎస్ తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

"రక్తం జల్లితే పంటలు పండుతాయి" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నిరసనలు తెలపడాన్ని మానవతా రాయ్ తప్పుబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, లోపభూయిష్టమైన డిజైన్ల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు రాజకీయ నాటకాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ కేవలం రాజకీయ డ్రామాలేనని కొట్టిపారేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story