News Analysis:

News Analysis:

Arun Chilukuri
Published on: 28 Sept 2026 11:58 AM IST
News Analysis:
X

News Analysis: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన, విద్యారంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన సంస్కరణలపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చ (News Analysis) కొనసాగింది. ఈ చర్చలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానవత రాయ్ పాల్గొని ప్రభుత్వ విధానాలను సమర్థించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారని, పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతోనే విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యార్థులు లేని మరియు తక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలలను మూసివేయడం లేదని, మెరుగైన వసతుల కోసం వాటిని 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'లో విలీనం (రేషనలైజేషన్) చేస్తున్నామని మానవత రాయ్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.