News Analysis: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన దేశానికే రోల్ మోడల్.. విపక్షాల విమర్శలపై నేత లింగం యాదవ్ కౌంటర్

News Analysis: తెలంగాణ అభివృద్ధిని దేశం మొత్తం చూస్తోందని, దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని కాంగ్రెస్ నేత లింగం యాదవ్ సవాల్ విసిరారు.

Arun Chilukuri
Published on: 5 Sept 2026 1:04 PM IST
News Analysis
X

News Analysis: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన దేశానికే రోల్ మోడల్.. విపక్షాల విమర్శలపై నేత లింగం యాదవ్ కౌంటర్

News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆ పార్టీ నేత లింగం యాదవ్ పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను గట్టిగా సమర్థించారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అందిస్తూ తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేశాయో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని లింగం యాదవ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ₹500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం పంపిణీతో పాటు ఏడాదిన్నర కాలంలోనే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా అమలు చేసి తీరుతామని, ప్రజల మద్దతు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story