BIG Debate: విద్యార్థులపై పోలీసుల దాడికి కేంద్రం జవాబు చెప్పాల్సిందే: సీపీఎం నేత బాబురావు

BIG Debate: ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాడికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం సీనియర్ నేత బాబురావు డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 11:22 AM IST
BIG Debate
X

BIG Debate: విద్యార్థులపై పోలీసుల దాడికి కేంద్రం జవాబు చెప్పాల్సిందే: సీపీఎం నేత బాబురావు

BIG Debate: ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, దీనికి పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనని సీపీఎం సీనియర్ నాయకుడు బాబురావు స్పష్టం చేశారు. 'hmtv' నిర్వహించిన బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్రంలోని బిజెపి-ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.

పార్లమెంట్ సమావేశాల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సభకు రాకపోవడం బాధాకరమని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు మాత్రమే కాకుండా, దేశ ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉందన్నారు. స్పీకర్‌కు లేఖలు రాస్తూ చర్చల నుంచి తప్పించుకునేందుకు యత్నించడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story