BIG Debate: సమాధానం చెప్పలేకే సభకు రావట్లేదు: సీపీఎం నేత జులకంటి రంగారెడ్డి

BIG Debate: ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు రావడం లేదని సీనియర్ సీపీఎం నాయకుడు జులకంటి రంగారెడ్డి విమర్శించారు.

Arun Chilukuri
Published on: 14 Aug 2026 11:38 AM IST
BIG Debate
X

BIG Debate: సమాధానం చెప్పలేకే సభకు రావట్లేదు: సీపీఎం నేత జులకంటి రంగారెడ్డి

BIG Debate: దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చర్చల నుంచి తప్పుకుంటోందని సీనియర్ సీపీఎం నాయకుడు జులకంటి రంగారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. hmtv 'బిగ్ డిబేట్'లో పాల్గొన్న ఆయన, పార్లమెంట్ సమావేశాల నిర్వహణ మరియు NEET లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలను కేవలం తమ సొంత ఎజెండాను అమలు చేయడానికే వాడుకుంటోందని రంగారెడ్డి ఆరోపించారు. "రైతులు, నిరుద్యోగులు, కార్మికుల సమస్యలపై ఎప్పుడైనా పార్లమెంట్‌లో సమగ్ర చర్చ తీసుకొచ్చారా?" అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల నుంచి తప్పించుకోవడం లేదా అంశాలను పక్కదారి పట్టించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story