Jordar News: కుక్క కరిస్తే.. ఎలా అయిపోయాడు.. చూడండి పాపం
Jordar News: కుక్క కరిచినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో చూశారా? రేబిస్ వ్యాధి బారిన పడి ఒక వ్యక్తి ఎంతలా బాధపడుతున్నాడో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
Jordar News: కుక్క కరిస్తే.. ఎలా అయిపోయాడు.. చూడండి పాపం
Jordar News: కుక్క కర్శినంక ఎమ్మటే దావకాణకు పోకపోవుట్ల గీ అన్న ఎట్ల మారిపేండు సూత్తార్రానుల్ల. నీళ్లు సూత్తెనే నిప్పులు చేత పట్టుకున్నట్టు గుబులు పడ్తున్నడు. అంత ఎట్లెట్లనో జేస్తున్నడు. షాక్ తగిలినట్టు ఎగుర్తున్నడు. కుక్క కర్సుట్ల రేబిస్ వ్యాధచ్చి ఇట్ల తయారైండు పాపం. రేబిస్ వ్యాధి అంటెనే గింత. ఎమ్మటే టీకా ఏంచుకోకపోతె తొల్త జరమత్తది, అటెంక నీళ‌్లను సూత్తెనే భయం పుడ్తది.
హైడ్రోఫోబియా అంటరట దీన్ని. వారం కిందట కర్శిందట కుక్క.. ఎమ్మటేవొయ్యి రేబిస్ టీకా ఏంచుకోవద్దా.. ఎహే నాకేం ఐతది.. ఉక్కు బాడీ అనుకున్నడో, లేక తెల్వక సప్పుడ్జేకున్నడో తెల్వది గనుల్ల, రోగం పెయ్యికెక్కి ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలున్న గురుదాస్‌పూర్ మెడికల్ సెంటర్ల ట్రీట్మెంటు తీస్కుంటున్నడు. కని, ఏం లాభం.. కుక్క కర్తె 24 గంటల్లనే రేబిస్ టీకా ఏంచుకోవాలె.. లేదంటె బత్కుడు కష్టమటనుల్ల.
ఒక్కసారి రేబిస్ లక్షణాలు కనవడ్డయంటే వందకు వందశాతం.. సావుకు ఆహ్వానం పల్కినట్టే. పాపం గీ అన్న.. మొదాలే జాగర్త పడ్తె ఒక్క టీకాతోటి ఒడ్శిపొయ్యేది.. అసోంటిది అట్టిగ గోటితోటి పొయ్యేదాన్ని గొడ్డలి దాంక తెచ్చుకున్నడు పాపం. ఇప్పుడు ఎంత అనుకున్న ఏం లాభం లేదు. సూత్తార్రు గదా జనాలు.. కుక్క కర్తె నిమ్మకు నీరెత్తినట్టు జాలిగం శెయ్యకుర్రుల్ల మీకు పుణ్యముంటది.. జర దగ్గరిపట్లున్న సర్కారు దావకాణకు వొయ్యి 24 గంటల్ల రేబిస్ టీకా ఏంచుకోర్రి.. పానాలు నిల్పుకోర్రి.. శెప్పలేదు అనద్దు మల్ల..




