BIG Debate: విద్యార్థులపై దాడులకు హోంశాఖ జవాబు చెప్పాలి: జర్నలిస్ట్ రెహమాన్
BIG Debate: ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడంపై సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
BIG Debate: విద్యార్థులపై దాడులకు హోంశాఖ జవాబు చెప్పాలి: జర్నలిస్ట్ రెహమాన్
BIG Debate: ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులు, విచక్షణారహిత లాఠీచార్జ్‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎందుకు మౌనం వహిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ ప్రశ్నించారు. ఢిల్లీ శాంతిభద్రతలు కేంద్ర హోంశాఖ (MHA) పరిధిలోనే ఉన్నందున, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. hmtv 'బిగ్ డిబేట్' (BIG Debate) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంటరీ వ్యవస్థపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో రాజ్యాంగబద్ధంగా నిరసనలు తెలుపుతున్న యువతపై లాఠీచార్జ్ జరగడం తీవ్రంగా కలచివేసిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. "శాంతియుతంగా ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై పిల్లెట్స్ వాడటం, మేకులు ఉన్న లాఠీలతో దాడులు చేయడం అమానుషం. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు చూపు, వినికిడి శక్తిని కూడా కోల్పోయారు.""నేమ్ ప్లేట్లు లేకుండా, యూనిఫాం వేసుకోకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాడులకు తెగబడటం దేశ ఆంతరంగిక భద్రతపై అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు.




