BIG Debate: డీలిమిటేషన్ 2026: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా?

BIG Debate: డీలిమిటేషన్ బిల్లు 2026, మహిళా రిజర్వేషన్ మరియు 130వ రాజ్యాంగ సవరణల ఆమోదం కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారింది. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలపై సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 18 July 2026 11:30 AM IST
BIG Debate
X

BIG Debate: డీలిమిటేషన్ 2026: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా?

BIG Debate: రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ప్రతిపాదించనున్న డీలిమిటేషన్ బిల్లు 2026 (నియోజకవర్గాల పునర్విభజన బిల్లు), మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు 130వ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఈ కీలక బిల్లులను పాస్ చేసుకోవడం కేంద్రంలోని బీజేపీ కూటమికి ఒక అగ్నిపరీక్ష లాంటిదని hmtv బిగ్ డిబేట్‌లో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ విశ్లేషించారు.

రాజ్యాంగ సవరణలు అవసరమైన ఈ బిల్లులు గట్టెక్కాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ (కనీసం 360 మంది ఎంపీల మద్దతు) అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ (NDA) కూటమికి 293 మంది సభ్యుల బలమే ఉంది. అయితే, రాబోయే ఎన్నికల్లో తమ విజయకేతనంగా చూపించుకోవడానికి బీజేపీకి 'మహిళా బిల్లు' అత్యంత కీలకంగా మారిందని గౌరీ శంకర్ పేర్కొన్నారు. ఈ నంబర్ గేమ్‌ను అధిగమించడానికి విపక్ష కూటమిలోని కొన్ని కీలక గ్రూపుల (టీఎంసీ, శివసేన వంటి పార్టీలలోని అసమ్మతి వర్గాల) మద్దతును మొబిలైజ్ చేయడానికి బీజేపీ తెరవెనుక తీవ్రంగా కసరత్తు చేస్తోందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story