Off The Record: శ్రీకాకుళంలో రచ్చ రేపుతున్న ధర్మాన వార్నింగ్
Off The Record: శ్రీకాకుళం రాజకీయాల్లో సంచలనం! వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Off The Record: శ్రీకాకుళంలో రచ్చ రేపుతున్న ధర్మాన వార్నింగ్
Off The Record: చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారుల పేర్లు నమోదు చేస్తాం. యాంగ్రీ బుక్ లో వారికి త్వరలో సినిమా చూపిస్తాం. చుక్కలు చూపిస్తాం.. నాలో ఇంకో యాంగిల్ చూపిస్తా అంటూ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో దుమారు రేపుతున్నాయి. ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ధర్మాన.. ఒక్కసారిగా తన సహజ శైలికి భిన్నంగా శివాలెత్తెడం చర్చనీయాంశమైంది.
శ్రీకాకుళం రూరల్‌లోని సర్పంచ్ ల వీడ్కోలు సభలో పాల్గొన్న ధర్మాన.. లోకేష్ రెడ్ బుక్ పై, చంద్రబాబుపై, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న అధికారులపై, వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న అందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేడర్లో జోష్ నింపేందుకు ఈ వ్యాఖ్యలు అనేది ఆయన అనుయాయులు చెబుతున్నారు. కాని ఆయన మాత్రం ప్రత్యేకంగా లిస్టు ప్రిపేర్ చేస్తున్నాం.. దీనిపై జగన్మోహన్రెడ్డిని ఒప్పిస్తా. శ్రీకాకుళం నుండే దీనికి శ్రీకారం చేసి రాష్ట్రమంతటా అమలు చేయనున్నాము... ఇది జరిగి తీరుతుందంటూ ఆయన వాడిగా వేడిగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశగా మారాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని అందరి నోట ఒకటే టాక్. వైసీపీని టార్గెట్ చేసి పనిచేస్తున్న యంత్రాంగానికి చుక్కలు చూపించి సినిమా చూపిస్తామని ఆ వేదికపై నుంచి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కూటమి పాలనలో ప్రతి పనికీ లంచాలు, కమిషన్ పద్దతిన దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కేడర్లో జోష్ నింపగా మళ్లీ ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారంటూ వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నారు, ఆయన చేసిన ప్రసంగంలో..ఎవరెవరు అధికారులు చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తారో వారి జాబితాను సిద్ధం చేస్తున్నానని ఆయన వ్యాఖ్యలు దుమారు లేపాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక.. చట్టా ఉల్లంఘించిన అధికారులు తిరిగి వైసీపీ పంచన చేరేందుకు ఏదో ఒక రాజకీయ నాయకుడి అండ దండలు చూసుకుని తప్పించుకోవాలని అనుకోవడం.. భ్రమే అని స్పష్టం చేశారు. ప్రత్యేక బుక్‌లో అటువంటి అధికారుల జాబితాను రాసిపెట్టుకుంటామన్నారు. రాసి పెట్టుకున్న బుక్ను తిరగేస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో ఎలా పనిచేశారు..? బుక్లో పేరుందా లేదా అని చెక్ చేస్తామన్నారు. కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర మంతా ఇదే తరహాలో భీజం వేయడానికి తాను త్వరంలో జగన్మోహన్రెడ్డి ని కలుస్తున్నానని తెలిపారు. మండల, నియోజకవర్గాల్లో కమిటీలు నమోదు చేస్తామన్నారు. వైసీపీ కార్యకర్తలపై కాకుండా ప్రజల్ని హింస్తున్న వారి లిస్టు కూడా తయారు చేయడం జరిగిందన్నారు ధర్మాన
వైసీపీ కార్యకర్తలపై కక్షకట్టిన అధికారులకు ప్రశ్నిస్తామన్నారు. ఆ అధికారి చెప్పే సమాధానాన్ని నోట్ చేస్తామన్నారు. ఈ శ్రీముఖాన్ని మూడు సంవత్సరాల తర్వాత వారికి చుక్కలు చూపించే కార్యక్రమం ఉంటుందని ఘాటుగానే హెచ్చ రించారు. రెండు సంవత్సరాలు అయ్యింది. అవతలి వ్యక్తులు హుషారుగా ఉన్నారు. ఇక భరించలేమని ధర్మాన స్పష్టం చేశారు. ఇంతటి రాజ్యాంగ విరుద్దమైన పరిపాలన ఏ రాష్ట్రంలో లేదని ధర్మాన వ్యాఖ్యానించారు. జిల్లాలో మాత్రం ధర్మాన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల పెద్ద చర్చేసాగుతుంది.
కొడాలి, పేర్ని, అంబటి, వంశీ వంటి వాళ్లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లే సమయంలో ధర్మాన ప్రసాదరావు ఇలా సౌండ్ మోడ్ లో బహిరంగంగానే హెచ్చరించడం పెద్ద దుమారమే లేపాయి. మరి యాగ్రీ బుక్ ప్రభావం ఎలా ఉండనుందో.. ఎలాంటి పొలిటికల్ హీట్‌ను రాజేస్తుందోన్న చర్చ షురువైంది. ఇక జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు మాత్రం మా నాయకుడు మారారు. చాలు మాకు, ప్రత్యర్థులకు, చట్ట విరుద్ధ అధికారులకు చుక్కలు చూపించడమే తరువాయి అంటున్నారు.. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో వేచి చేడాల్సిందే మరి.




