Off The Record: అర్వింద్‌కు అధిష్టానం భారీ గిఫ్ట్
Off The Record: తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ ధర్మపురి అరవింద్ చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది.
Off The Record: అర్వింద్‌కు అధిష్టానం భారీ గిఫ్ట్
Off The Record: తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే ధర్మపురి అరవింద్..! ఒకప్పుడు నిజామాబాద్ రాజకీయాలకే పరిమితమైన నేత... ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. బీఆర్ఎస్‌ను రాజకీయ బాణాలతో చీల్చిచెండాడుతూ... అవసరమైతే సొంత పార్టీ నేతలనే ముక్కుసూటిగా ప్రశ్నించే తత్వంతో ఫైర్ బ్రాండ్ అన్న ముద్ర వేసుకున్నారు.
మరి ఈ దూకుడికి ఢిల్లీ నుంచి బహుమతి దక్కబోతోందా? దక్కితే ఎలాంటి బహుమతి దక్కుతోంది..? కేంద్ర మంత్రి పదవా? లేక జాతీయ కార్యవర్గంలో చోటీస్తారా...? లేక తెలంగాణ బీజేపీ భవిష్యత్ సారథిగా కొత్త బాధ్యతలిస్తారా? రాష్ట్ర బీజేపీలో కొత్త సమీకరణాలకు తెరలేస్తుందా? మాటకు మాట,తూటాకు తూటా...అన్నట్టుగా రాజకీయాల్లో మిస్సైల్‌లా దూసుకుపోతున్న ధర్మపురి అరవింద్ పై hmtv ప్రత్యేక కథనం.




