Off The Record: కూతురికి బంపర్ ఆఫర్.. తండ్రికి బిగ్ షాక్?

Off The Record: టీడీపీ సీనియర్ నేత ధూలిపాల నరేంద్ర కుమార్తె వైదీప్తి వివాహానికి హాజరైన నారా లోకేష్, ఆమెకు రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర హామీ ఇచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 8:16 AM IST
Off The Record
X

Off The Record: కూతురికి బంపర్ ఆఫర్.. తండ్రికి బిగ్ షాక్?

Off The Record: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్తె వైదీప్తి వివాహ వేడుక ఒక రాజకీయ సంచలనానికి వేదికైంది. ఈ పెళ్లికి హాజరైన టీడీపీ యువనేత నారా లోకేష్, పెళ్లి కుమార్తెను ఆశీర్వదిస్తూనే భవిష్యత్తు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "మహిళా రిజర్వేషన్లు వస్తున్నాయి.. నువ్వు సిద్ధంగా ఉండు" అంటూ వైదీప్తికి నేరుగా ఎమ్మెల్యే సీటు ఆఫర్ ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నియోజకవర్గాలు పెరిగితే మహిళలకు కనీసం ఐదు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. పొన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ధూలిపాల కుటుంబానికి ఉన్న పట్టును దృష్టిలో ఉంచుకుని, వైదీప్తిని ఒక బలమైన మహిళా నాయకురాలిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధిష్టానం ఇప్పటి నుంచే పునాది వేస్తున్నట్లు కనిపిస్తోంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story