BIG STORY: దుమారం రేపిన ఖర్గే విషెస్!
BIG STORY: దీపావళిని ‘ఖుషియోన్ కీ ఏక్ ఈద్’ అని వర్ణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించింది.
BIG STORY: దుమారం రేపిన ఖర్గే విషెస్!
BIG STORY: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు దేశ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. దీపావళిని ‘ఖుషియోన్ కీ ఏక్ ఈద్’ అంటూ ఆయన అభివర్ణించారు. ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
మైనారిటీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ మతపరమైన బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ప్రధానంగా ఈద్ అనే పదాన్ని ఉపయోగించడంపై భారతీయ జనతా పార్టీ అసంత్రుప్తి వ్యక్తం చేసింది.సహజంగా రంజాన్, బక్రీవ్ వంటి పండుగలను ఈద్ గా పేర్కొంటారు. హిందువుల ప్రమిద పండగ అయిన దీపావళిని మైనారిటీల పండగలతో ముడిపెట్టారని బీజేపీ మండిపడింది.
దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖర్గే.. దేశ ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దేశమంతటా అందరూ జరుపుకొనే పెద్ద పండగని, సంతోషాలను పంచే ఒక అతి పెద్ద వేడుక అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ‘ఖుషియోన్ కీ ఏక్ ఈద్’ అనే పదాన్ని ఉపయోగించారు. పండగ వేళ ప్రజల మధ్య ఐక్యత పెరగాలని, సామాజిక విభేదాలు తొలగిపోవాలని దీపావళి సందర్బంగా మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. హిందువుల పవిత్ర పండగ దీపావళిని మరో మతానికి చెందిన పండగతో పోల్చడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు.
మతపరమైన బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. కథ అక్కడితో ఆగలేదు. గతంలో మహాకుంభమేళాపై మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను అలాగే ఛఠ్ పూజ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కూడా సీఆర్ కేశవన్ ప్రస్తావించారు.
కాగా ఖర్గే చేసిన ఈద్ పద ప్రయోగాన్ని మరో బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కూడా తప్పుపట్టారు.
ఖర్గే వ్యాఖ్యలను బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఈద్‌ను హిందూ పండగతో పోల్చి కాంగ్రెస్ నేతలు మాట్లాడగలరా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ నేత గౌరవ్ భాటియా ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీపావళి పండుగకు
ప్రత్యేకమైన సంప్రదాయాలు, గుర్తింపు ఉన్నాయన్నారు. దీపావళి పండుగను అదే పేరుతో గౌరవించాలని గౌరవ్ భాటియా అభిప్రాయపడ్డారు.
అయితే మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల్లో ఎటువంటి దురుద్దేశం లేదని కాంగ్రెస్ నేతలు వివరణ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకొనే సంతోషాల పండగ’ అనే ఉద్దేశంతోనే ఈద్ అనే పదాన్ని ఖర్గే ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు వివరణ ఇచ్చారు.
ఖర్గే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమర్థించింది. ‘ఈద్’ అనే పదాన్ని మతపరమైన అర్థంలో కాకుండా సంతోషాల వేడుక అనే విస్తృత భావంలో ఖర్గే ఉపయోగించారని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. అంతేకాదు, వివిధ మతాలు, సంస్కృతుల మధ్య ఐక్యతను చాటడమే ఖర్గే ఉద్దేశమని తెలిపింది.
మొత్తంమీద దీపావళి శుభాకాంక్షల సందర్భంగా మొదలైన వివాదం కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలకు వేదికగా మారింది.




