Burning Topic: రోజుకో మాట మారుస్తున్న ట్రంప్.. ఈసారి మళ్ళీ శాంతి!
Burning Topic: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో ఆకస్మిక మార్పు. ఆయుధ కొరత, మధ్యంతర ఎన్నికల భయంతో హర్మూజ్ జలసంధిపైనే ట్రంప్ దృష్టి.
Burning Topic: రోజుకో మాట మారుస్తున్న ట్రంప్.. ఈసారి మళ్ళీ శాంతి!
Burning Topic: నిండా మునిగాక చలి గుర్తుకొచ్చింది.. సామెత రివర్స్ అయిందనుకుంటున్నారా? ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే ఉన్నాయి. ఇరాన్ మీద భారీ సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామంటూ హుంకరిస్తూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పశ్చిమాసియా నుంచి సురక్షితంగా బయట పడే దారులు వెతుకుతున్నట్లు కనిపిస్తోంది.
అణు ఒప్పందం కుదరకపోయినా, హర్మూజ్ జలసంధి తెరిస్తే చాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. హఠాత్తుగా ట్రంప్ వైఖరిలో మార్పు ఎందుకు వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఒకవైపు తరుగుతున్న ఆయుధ నిల్వలు.. మరోవైపు మధ్యంతర ఎన్నికలు ఇందుకు కారణమంటున్నారు.
Next Story




