Burning Topic: ట్రంప్ స్వార్థం తో బలి అవుతున్న ప్రపంచ దేశాలు!

Burning Topic: పశ్చిమాసియా సంక్షోభంలో ట్రంప్ పాత్ర. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరియు ఆయిల్ మార్కెట్ ట్రేడింగ్ వివాదంపై ప్రత్యేక విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 April 2026 6:38 AM IST
Burning Topic
X

Burning Topic: ట్రంప్ స్వార్థం తో బలి అవుతున్న ప్రపంచ దేశాలు!

Burning Topic: పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ముగిసే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగుస్తున్నా ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇందుకు అమెరికా దుందుడుకు విధానాలే కారణమని స్పష్టంగా అర్థమవుతోంది.హార్మూజ్‌ జలసంధిలో ప్రవేశిస్తున్న ఇరాన్‌ రవాణా నౌకపై దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపించుకుంది.

హార్మూజ్‌ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సమస్యలను ఆయన మరింత తీవ్రం చేస్తున్నరని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇరాన్‌ను చుట్టుముట్టి, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే లొంగి వస్తుందని ఆయన అంచనా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండోవిడత చర్చలు ఉంటాయా లేదా అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

అమెరికా ఒత్తిళ్లు లొంగే ప్రసక్తే లేదని, తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేసింది ఇరాన్. డొనాల్డ్ ట్రంప్ తమపై బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో అమెరికాతో చర్చలకు అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ ఘాలిబఫ్‌. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో పాటు తమ నౌకల రాకపోకలపై దిగ్బంధనం విధించడంతోదౌత్య సంబంధాలను దెబ్బతీశారని ఆరోపించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే ఉద్దేశ్యంతోనే ట్రంప్ ఇలాంటి విధానాలను అవలంభిస్తున్నారని ఆయన అన్నారు.

కాగా ఇరాన్‌ చర్చల్లో పాల్గొనడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా దిగ్బంధనం ఎత్తివేసే వరకు చర్చల్లో పాల్గొనేది లేదని ఓ వర్గం చెబుతుండగా, ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు మరో వర్గం వెల్లడిస్తోంది. మరోవైపు అమెరికా తరపున చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ట్రంప్ అల్లుడు కుష్నెర్‌, ఆయన సలహాదారు విట్‌కాఫ్ ఇస్లామాబాద్ వెళుతున్నారు. ఇరాన్ నుంచి ఘాలిబఫ్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story