Burning Topic: భారత్ పై ట్రంప్ బలుపు మాటలు..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మోడీ

Burning Topic: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటి? భారత్, ఇరాన్ దేశాలు ట్రంప్‌కు ఎలా సమాధానం ఇచ్చాయి?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 April 2026 6:57 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్ పై ట్రంప్ బలుపు మాటలు..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మోడీ

Burning Topic: అగ్రరాజ్యానికి అధినాయకుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అధ్యక్ష పదవీ కాలంలో కూడా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 2024 నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన అనేక వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారాన్ని రేపాయి.

2024 ఏప్రిల్‌లో అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ రాసిన ఒక వివాదాస్పద లేఖను ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికపై రీ-పోస్ట్ చేశారు. ఈ లేఖలో భారత్, చైనాలు "నరకకూపాలు" అని అభివర్ణించారు. గతంలో భారతీయ ఐటీ నిపుణులను "ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు" అని పేర్కొనడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వలసదారులు కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కల్పించడం కోసమే గర్భంతో ఉన్నప్పుడు అమెరికాకు వస్తారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ట్రంప్ సమర్థించారు. ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, వివాదం ముదిరిన కొన్ని గంటల్లోనే ట్రంప్ యూ-టర్న్ తీసుకుని "భారత్ చాలా మంచి మిత్రుడు" అని చెప్పడం గమనార్హం.

ట్రంప్‌కి సహజంగానే మెదడులో పురుగు తొలుస్తుందో.. ఏమో.. అప్పడడప్పుడు భారత్‌తో కిల్లికజ్జలాకు పోతుంటాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వాణిజ్య సంబంధాలను ట్రంప్ "ఏకపక్ష విపత్తు" గా అభివర్ణించారు. భారత వస్తువులపై 25 శాతం పరస్పర సుంకాలతోపాటు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు మరో 25 శాతం అదనపు సుంకం విధిస్తామని హెచ్చరించారు. మొత్తంగా 50 శాతం సుంకం విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాదూ.. 2025 సెప్టెంబర్‌లో SCO సదస్సు తర్వాత, "భారత్, రష్యాలను మనం చైనాకు వదిలేశాం" అంటూ సంచలన పోస్ట్ చేశారు తెంపరి ట్రంప్. ఇటీవల వాతావరణ మార్పులపై మాట్లాడుతూ ప్రపంచం నిజానికి చల్లబడుతోందని, అందుకే "గ్లోబల్ వార్మింగ్" అనే పదాన్ని వదిలేసి "క్లైమేట్ చేంజ్" అని వాడుతున్నారని శాస్త్రీయ ఆధారాలు లేని వ్యాఖ్యలు చేసి చిచ్చు రేపారు.

ఇలా ట్రంప్ వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదమవుతుంటాయి. తాజాగా భారతదేశం ఒక నరకకూపమంటూ నోరు పారేసుకోవడంపై ప్రపంచ దేశాలు అవాక్కయ్యాయి. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెంటనే తేరుకుని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ట్రంప్ నేరుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, అమెరికా ప్రభుత్వం ఆయన పాత ప్రశంసలను హైలైట్ చేస్తూ వివాదాన్ని చల్లబరిచేందుకు ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియాలో ఈ వివాద్పద వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. అయితే, ట్రంప్ దీనిని పోస్ట్ చేసిన కొద్ది సేపటికే భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.

‘భారత్ నరకకూపం’ అంటూ జాత్యాహంకార వ్యాఖ్యల పోస్ట్‌ను రీట్వీట్ చేసిన ట్రంప్.. వెంటనే మాట మార్చారు. ‘భారత్ గొప్ప దేశమని.. దానిని నడిపించే నాయకుడు నాకు మంచి స్నేహితుడు’ అని ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని అమెరికా రాయబారి మీడియాకు వెల్లడించారు. కాగా ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు "అనుచితమైనవి", "వాస్తవ విరుద్ధమైనవి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఇవి భారత్-అమెరికా మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబించబోవని స్పష్టం చేసింది.

ట్రంప్ నరకకూపం వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చిపారేసింది. ముంబయిలోని ఇరాన్ ఎంబసీ ఊహించని రీతిలో బుద్ధి చెప్పింది. 'నీకు భారత సంస్కృతి గురించి తెలియదు.. ముందు ఇక్కడికి వచ్చి చూడు. ఆ తర్వాత మాట్లాడు' అంటూ మహారాష్ట్రలోని అద్భుత దృశ్యాలను ట్రంప్‌కు ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చింది ఇరాన్ రాయబార కార్యాలయ ప్రతినిధులు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story