MAMA: వైఎస్సార్ 'ఆత్మ'గా పేరున్న కేవీపీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. రాజశేఖరరెడ్డితో అనుబంధంపై ఆసక్తికర విశేషాలు!

MAMA: వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధం, నాటి రాజకీయ పరిణామాలపై డాక్టర్ కేవీపీ రామచంద్రరావు హెచ్‌ఎంటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు.

Arun Chilukuri
Published on: 23 Sept 2026 11:21 AM IST
MAMA
X

MAMA: వైఎస్సార్ 'ఆత్మ'గా పేరున్న కేవీపీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. రాజశేఖరరెడ్డితో అనుబంధంపై ఆసక్తికర విశేషాలు!

MAMA: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన 'ఆత్మ'గా రాజకీయ వర్గాల్లో పేరుగాంచిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తాజాగా హెచ్‌ఎంటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, నాటి కీలక పరిణామాలు మరియు వైఎస్‌ఆర్‌తో తన నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని ఈ ఇంటర్వ్యూలో ఆయన నెమరువేసుకున్నారు.

వైఎస్‌తో తన మొదటి పరిచయం, 1969 నుంచి ఇద్దరి మధ్య సాగిన ప్రయాణాన్ని కేవీపీ గుర్తుచేసుకున్నారు. తన సొంతూరు నరసరావుపేటతో పాటు కుటుంబ నేపథ్యం, పెట్లూరు వారిపాలెం జమీందార్ల గురించి ప్రస్తావించారు. రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న సవాళ్లు, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలపై తనదైన శైలిలో స్పందించారు.

ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నలకు కేవీపీ బదులిచ్చారు. ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించినప్పుడు 'నో కామెంట్స్' అంటూనే, పార్టీ ఆదేశిస్తే జాతీయ స్థాయిలో లేదా ఏ రాష్ట్రానికైనా వెళ్లి బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అలాగే రాహుల్ గాంధీ భవిష్యత్తులో దేశ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ ఒక దేవుడిలా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నట్లు కేవీపీ భావోద్వేగంతో తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.