Jordar Varthalu: నేను బస్సు నడుపుతా తాగుబోతు హల్ చల్
Jordar Varthalu: హుజూరాబాద్ బస్ స్టాండ్ లో తాగుబోతు వీరంగం! డ్రైవర్ లేని సమయంలో బస్సు ఎక్కి స్టీరింగ్ పట్టుకున్న మందుబాబు.
Jordar Varthalu: నేను బస్సు నడుపుతా తాగుబోతు హల్ చల్
Jordar Varthalu: వీని ఆగంల మన్నువడా.. కట్టె అందుకొని ఎటువడ్తె అటే సంపుతున్నడు బద్మాషోడు. వారీ.. ఏ పాటి తాగినవ్ రా. నిన్ను కాకులు గద్దలు ఎత్కపోను. నీ దౌడలు దగ్గరవడ. బద్మాషోడా. తాగుతె, ఏం జేత్తున్నవో ఎర్కైతలేదు ర వారీ నీకు. ఇంకో రెండు గట్టిగ సప్పరియ్యుల్లే అన్నలు. మాయి సుతం రెండు గట్టిగ అందుకోర్రి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్ల గీ తాగువోతోడు, నిషా మైకంల ఇంత ఆగం పనిముంగటేసుకున్నడు. బస్సోటి పాయింటు మీదికి అచ్చిందట. డ్రైవరన్న ఒంటికి పోదామని దిగంగనే.. ఈడు లట్కనపొయ్యి డ్రైవరన్న సీట్లెక్కి కూసున్నడట. ఎంతకు దిగకుంట, ఏయ్.. ఎవడ్రా నన్నాపేది. ఇయ్యాల ఈ బస్సును నేనే నడ్పుతా. అనుకుంట స్టీరింగ్ తిప్పుకుంట ఆగమాగం జేశిండట. ఇగ సుట్టుముట్టున్నోల్లంత కల్శి తాగువోతోన్ని మెల్లగ కిందికి దింపుతె, ఓ బడ్తె దొర్కవట్టుకొని డ్రైవరన్న మీదికి పోయిండు. నన్నే దింపుతవా అన్నట్టే, అన్నను రెండు శిప్పసప్ప సంపిండు. ఇగాడున్నోల్లు మెల్లగ దొర్కిచ్చుకొని, తాగింది దిగెతట్టు నాలుగు సప్పరిచ్చిర్రు. స్టేషన్కు తోల్కపోయి పోలీసోల్లకు అప్పజెప్పిర్రు. మరి లిక్కర్ కిక్కు తగ్గినంక, స్టేషన్కు ఎందుకు పోయిండన్నది తెలుస్తది కావచ్చు కని, హైయ్యెస్టు ట్యాక్సు పేయర్లతోని సర్కారుకు ఎంత ఆమ్దానీ ఉందో.. తిప్పలు గూడ అన్నే ఉన్నయ్ పోర్రి.




