Burning Topic: భారత్‌కు పుతిన్ భారీ గుడ్‌న్యూస్..చమురు సరఫరాలో ఫుల్ సపోర్ట్!
Burning Topic: మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. బ్రిక్స్ ఆహ్వానం, వాణిజ్య లోటు, చమురు దిగుమతులపై చర్చించారు.
Burning Topic: భారత్‌కు పుతిన్ భారీ గుడ్‌న్యూస్..చమురు సరఫరాలో ఫుల్ సపోర్ట్!
Burning Topic: భారత్‌కు చిరకాల మిత్ర దేశం రష్యా.. ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, యూరోప్ దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ ఆ దేశంతో సంబంధాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా మన దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా కొనుగోళ్లను కొనసాస్తున్నాం.
2026 జూన్‌లో మన మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా సగం వాటా రష్యాదే. ఈ నేపథ్యంలో మాస్కోలో పర్యటించారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను కలుసుకున్నారు. సెప్టెంబరు 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరుకానున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ సమావేశాలకు ఆహ్వానిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని జైశంకర్ ఆయనకు అందించారు. షాంఘై సదస్సు తర్వాత మీతో చర్చించేందుకు ప్రధాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ భేటీలోనే మిమ్మల్ని బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించనున్నారని తెలిపారు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీలో పలు అంతర్జాతీయ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు జైశంకర్. భారత్- రష్యా సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా దృష్టి పెట్టడంతో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మెరుగు పడ్డాయని పుతిన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, ఎరువుల సరఫరా రంగాల్లో సహకారాన్ని విస్తరించాలని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కారణంగా ఇంధనం, ఎరువుల సరఫరాల్లో అవరోధాలను ఎదుర్కొంటున్న భారత్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పుతిన్ భరోసా ఇచ్చారు.
భారత వ్యవసాయ రంగానికి, రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాను మరింత పెంచుతుందని హామీ ఇచ్చారు, అణు విద్యుత్, హైటెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశంలో రష్యా, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పాల్గొన్నారు.
మాస్కో పర్యటనలో భాగంగా భారత విదేశాంగమంత్రి జైశంకర్ రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంతురోవ్‌తో కలిసి 27వ ఇండో–రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు, అధికారుల మధ్య వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై చర్చలు జరిగాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో భారత్- రష్యా మధ్య వ్యాపారం నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, ఇదే సమయంలో వాణిజ్య లోటు భారీగా పెరగడంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
2021-22 సమయంలో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2023-24 నాటికి దాదాపు 60 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 50 బిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. ఈ వాణిజ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే ప్రస్తుతం భారత్ ముందున్న అతిపెద్ద ప్రాధాన్యం అని జైశంకర్ స్పష్టం చేశారు.
భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఇరు దేశాలు తక్షణ చర్యలు చేపట్టాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కీలక సూచనలు చేశారు.. ప్రభుత్వాలు నిబంధనల్ని సడలిస్తాయి.
కానీ అసలు వ్యాపారం, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన చేసేది ప్రైవేట్ సంస్థలే కాబట్టి పారిశ్రామిక వర్గాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని జైశంకర్ సూచించారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య మార్గాల్ని వైవిధ్యంగా మారుస్తూ, రిస్క్‌ను తగ్గించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.
వీటికి తోడు ఇంకా పన్నులు, నాన్- టారిఫ్ అడ్డంకుల్ని తొలగించడం, ఇరు దేశాల చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా వాణిజ్యాన్ని సమసతలం చేయొచ్చని, అసమతుల్యతను తగ్గించొచ్చని ప్రతిపాదించారు.
మరోవైపు రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. జూన్, జూలై 2026 నాటికి భారత్ మొత్తం దిగుమతుల్లో సుమారు 50% నుంచి 55.5% వరకు చేరాయి. భారత రిఫైనరీలు రష్యా నుండి రోజుకు సగటున 2.4 నుండి 2.8 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి.
2022లో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత అమెరికా, యూరోప్ దేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. అప్పుడు రష్యా తన చమురును భారత్, చైనా దేశాలకు తక్కువ ధరకు చమురు విక్రయించడం ప్రారంభించింది.
అమెరికా ఆంక్షలు, సుంకాలు విధించినా 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను తీర్చడమే తమ జాతీయ ప్రాధాన్యత అని భారత్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని రిఫైనరీలు దెబ్బతినడంతో అక్కడ ఇంధన కొరత ఏర్పడింది. దీంతో భారత్ నయారా ఎనర్జీ రిఫైనరీ ద్వారా రష్యాకు గ్యాసోలిన్ ఎగుమతి చేయడం గమనార్హం




