Burning Topic: ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో విలయం

Burning Topic: భారతదేశంపై సూపర్ ఎల్ నినో ప్రభావం పడనుందని, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 April 2026 12:24 PM IST
Burning Topic
X

Burning Topic: ముంచుకొస్తున్న సూపర్ ఎల్ నినో విలయం

Burning Topic: ఈ ఏడాది వర్షపాతం తక్కువ అనే వార్తలు రావడం దేశ వ్యాప్తంగా అన్నదాతలను కలవర పెడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మొహం చాటేయడంతో వానాకాలంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వచ్చే ఈ వర్షాలు భారత్‌ మొత్తం వార్షిక వర్షపాతంలో దాదాపు 75 శాతం వాటా కలిగి ఉంటాయి. ఈశాన్యం, వాయవ్యం, దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకన్నా ఎక్కువగా వర్షాలు పడొచ్చు. ఈ ఏడాది రుతుపవనాలపై ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ వెలువరించిన తాజా నివేదిక కలవర పెడుతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో వర్షాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని, సగటు వర్షపాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. భారత వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు ఏడాదిలో దేశానికి అవసరమైన వర్షపాతంలో 75 శాతాన్ని అందిస్తాయని చెప్పింది. ఈ ఏడాది మాత్రం దీర్ఘకాలిక సగటులో కేవలం 92 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సాధారణంగా వర్షపాతం 90 శాతం నుంచి 95 శాతం మధ్య నమోదైతే దానిని ‘సాధారణం కంటే తక్కువ’ గా పరిగణిస్తారు. దేశంలోని సింహభాగంలో సాధారణం కన్నా తక్కువ వానలు ఉండొచ్చు. ఈశాన్యం, వాయవ్యం, దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకన్నా ఎక్కువగా వర్షాలు పడొచ్చు. ఈ ఏడాది రుతుపవనాలపై ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story