Jordar Varthalu: వామ్మో.. ఏనుగుకు కోపం వస్తే ఇలా ఉంటుందా?
Jordar Varthalu: కేరళలోని ఒక ఆలయం వద్ద గజరాజు ఒక్కసారిగా ప్రళయం సృష్టించాడు.
Jordar Varthalu: వామ్మో.. ఏనుగుకు కోపం వస్తే ఇలా ఉంటుందా?
Jordar Varthalu: కోపం సల్లగుండ తక్వలేదు గద గజరాజుకు. బంగారమసొంటి కారును పాత ఇన్ప సామాన్లకు సుతం పనికి రాకుంట జేస్తున్నది గదా పాడై. కారు, ఏనుగు నడ్మ బండి ఉత్తగ బలైపోయింది. బొమ్మకారును తీశేశ్నంత అల్కగ, తోపుకారును గుంజి పారేశింది. పయ్యలమీదనే ఎందుకుండాలనుకున్నదో ఎట్లనో.. ఉల్టాపల్టా ఏశి ఫుట్ బాల్ ఆడుకున్నది కార్తోని.
పొయ్యేది సక్కగ పోక, ఎన్కకచ్చి మరీ బాలయ్య రేంజుల బంతాడుకుంటుంది. కండ్ల ముందే కాదు.. కనుచూపు మేరల గూడ కనిపియ్యద్దన్నట్టే.. తిరిగచ్చి మరీ కారును శిత్తు శిత్తు జేశింది. కొబ్బరి శెట్టునైతే తాటి మట్ట లెక్కనే ఇర్శి అవ్తల వారేశింది. బాహుబలి సిన్మాల హీరో పీకినట్టే పీకింది. గాలిల గిర్ర గిర్ర తిప్పింది. కారునైతే హాలీవుడ్ సిన్మాల హల్క్ లెక్కనే ఆడుకుంది. ఎటువడ్తె అటువడేశి, డెంట్లేశెతందుకు సుతం అక్కెరకు రాకుంట జేశింది. కేరళ దిక్కు అంగమాలి అనే ఊర్లున్న కిడంగూర్ మహావిష్ణువు గుడి సన్నిదానానికి ఈ ఏనుగును పట్కచ్చిర్రట. దీన్ని దేవుని గుడోల్లు పెంచుతున్నరట. పెద్దపండుగలైనప్పుడు దేవునివిగ్రహాల ఊరేగింపులు తీత్తరట ఈ ఏనుగుమీద. అంత మంచిగనే ఉంది గనీ., పొద్దు పొద్దుగాల తానం జేత్తాంటె, ఎవలో కట్టెతోని కొట్టిర్రట ఇగ అప్పటి సుంది ఆగమాగం జేశిందట. రెండు గంటలు మన్షులకు నిమ్మలం లేకుంట జేశింది. కనపడ్డ వాటినల్ల ఫుట్ బాల్ ఆడుకున్నది. ఇగ తాళ్లతోని శానాసేపే కట్టెయ్య సూశిర్రు కనీ., అస్సల్కే కంట్రోల్ గాకపోవుడ్తోని మత్తు సూదులేశి శాంతింపజేశిర్రట. గప్పుడు భక్తులు, గుడోల్లు నిమ్మలమైన్రు. అప్పటికే ఒగల జీవితీశింది. ఒకాయ్నకు గట్టిగనే దెబ్బలు తాకినయట. కార్లు, బండ్లు శెడ్డుకు పొయ్యే కాడికచ్చిందట. సుట్టుముట్టు మంది ఎక్వలేకపోయెటాలకు పెద్ద పర్శాన్ తప్పింది. కనీ., లేకుంటె ఇంకెంత పర్శానయ్యుండేదో పోర్రి. అడ్విల పెర్గే వాటిని అడ్విలనే ఉండెనిస్తె మంచిదని అనుకోవట్టిర్రు ఈ ఏనుగు కోపం సూశ్న జనాలు.




