Burning Topic: కొత్త ప్రపంచ పటాన్ని ఆవిష్కరించిన ఐక్య రాజ్య సమితి!

Burning Topic: మెర్కేటర్ లోపాలను సవరించడానికి ఐరాస 'ఈక్వల్ ఎర్త్' మ్యాప్ తెచ్చింది. ఇది దేశాల సరైన పరిమాణాలను చూపుతుంది. భారత్ దీన్ని సమర్థిస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Sept 2026 7:01 AM IST
Burning Topic
X

Burning Topic: కొత్త ప్రపంచ పటాన్ని ఆవిష్కరించిన ఐక్య రాజ్య సమితి!

Burning Topic: మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో, తరగతి గదుల గోడలపై చూసిన ప్రపంచ పటం వాస్తవం కాదా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. విస్తృతంగా ప్రచారంలో ఉన్న మెర్కేటర్ మ్యాప్ దేశాలు, ఖండాల అసలు పరిమాణాలను కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా చూపించదు.

మనం చూస్తున్న ఈ చిత్ర పటం 1569లో గెరార్డస్ మెర్కేటర్ అనే డచ్ భౌగోళిక శాస్త్రవేత్త రూపొంచిందారు ఇందులో ఉత్తర, దక్షిణ ధ్రువాల సమీపంలోని ప్రాంతాల పరిమాణాన్ని పెద్దగా, భూమధ్య రేఖకు సమీపంలోని ప్రదేశాల వైశాల్యం చిన్నగా ఉన్నట్లు ఈ పటం చూపుతోంది. భూమి గుండ్రంగా త్రీడీలో ఉంటే.. కాగితం 2డీలో ఉండటం అసలు సమస్యకు కారణం.

దీన్ని సరిచేసేందుకు మ్యాప్‌ ప్రొజెక్షన్‌ పద్ధతిని ఉపయోగించారు. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత మెర్కాటర్‌ ప్రొజెక్షన్‌లో తేడాలు వచ్చేశాయి. ఆ కారణంగానే గ్రీన్‌లాండ్‌ పరిమాణం పెద్దగా ఉన్నట్లు వున్నట్లు ఆ పటం చూపుతోంది. నిజానికి ఆఫ్రికా ఖండం గ్రీన్‌లాండ్‌ కన్నా 14 రెట్లు పెద్దగా ఉంది.

16వ శతాబ్దంలో మెర్కాటర్‌ ఈ మ్యాపును కేవలం సముద్రయానం కోసం మాత్రమే తయారు చేశాడు. అందుకే ఆఫ్రికా విస్తీర్ణం 303.7 కోట్ల చదరపు కిలోమీటర్లయినా.. మెర్కాటర్‌ మ్యాప్‌లో 21.7 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ కంటే చిన్నగా కనిపిస్తూంటుంది.

ఈ తేడాలు అనేక ఇతర సమస్యలను తీసుకొచ్చాయి. ఇలాంటి పరిమాణ వ్యత్యాసాలను తగ్గించే లక్ష్యంతో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌ ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. ప్రపంచంలోని వివిధ ఖండాల భూభాగాలను వాటి వాస్తవ విస్తీర్ణానికి దగ్గరగా చూపించడమే దీని ప్రధాన ఉద్దేశం.

2018లో బోజన్‌ సావ్రిచ్, టామ్‌ ప్యాటర్సన్, బెర్న్‌హార్డ్‌ జెన్నీ అనే ముగ్గురు కార్టోగ్రాఫర్‌లు ‘ఈక్వల్‌ ఎర్త్‌’ మ్యాప్‌ను రూపొందించారు. భూభాగాల విస్తీర్ణాన్ని సరిగ్గా చూపించడం ఈ ప్రొజెక్షన్‌ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు...లెక్కల్లో గట్టిగా ఉండటమే కాకుండా.. చూసేందుకు కూడా సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈక్వల్‌ ఎర్త్‌ ప్రొజెక్షన్‌ ఖండాల మధ్య ఉన్న వాస్తవ విస్తీర్ణ నిష్పత్తిని కాపాడటంతో పాటు, భూవిస్తీర్ణాన్ని సాధ్యమైనంత కచ్చితంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మ్యాప్‌లో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా ప్రాంతాలు ప్రస్తుతం మెర్కేటర్‌ మ్యాప్‌లో కనిపించే దానికంటే పెద్దగా కనిపిస్తాయి.

మరోవైపు ఉత్తర ప్రాంతాల పరిమాణం తగ్గుతుంది.. ఈక్వల్‌ ఎర్త్‌ ప్రొజెక్షన్‌లో భూభాగాల పరిమాణాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల ఎవరో పెద్ద... మిగిలిన వారు చిన్న అన్న భావన భావన ఏర్పడే అవకాశం ఉండదని చెబుతున్నారు.

ఖండాల వాస్తవ విస్తీర్ణాన్ని మరింత కచ్చితంగా ప్రతిబింబించే కొత్త ప్రపంచ పటాన్ని ప్రోత్సహించే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించింది. కరెక్ట్‌ ద మ్యాప్‌ అనే నినాదంతో టోగో దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 193 మంది సమితి సర్వప్రతినిధుల సభలో 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి.

అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈక్వల్‌ ఎర్త్‌ ప్రొజెక్షన్‌ మ్యాప్‌ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ఉద్యమం ఫలితంగానే సాకారమైందని చెప్పాలి. ఆఫ్రికన్‌ దేశం టోగో కొత్త మ్యాప్‌ ప్రతిపాదన చేయగా ఆఫ్రికన్‌ యూనియన్‌ మద్దతు ఇచ్చింది.

ఆఫ్రికా పరిమాణాన్ని సరిగ్గా చూపడమే కాకుండా... పాత అసమానతలను సరి చేయాలన్నది ఆఫ్రికా దేశాల ఉద్దేశం. 16వ శతాబ్దంలో నౌకాయనం కోసం రూపొందించిన మర్కేట పటాన్ని సమితి తీర్మానం కాలం చెల్లినదిగా ప్రకటించింది.

ఇందుకు తగ్గట్టుగానే తీర్మానం కూడా పాఠశాలల్లో, పాఠ్యపుస్తకాల్లో మీడియా, సంస్థలు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఈక్వల్‌ ఎర్త్‌ వంటి ప్రొజెక్షన్ల వినియోగాన్ని పెంచమని కోరింది. సర్వప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో సరికొత్త ప్రపంచ పటానికి అనుకూలంగా భారత్‌ ఓటేసింది.

పాత మ్యాప్‌లో అమెరికా పరిమాణం వాస్తవ వైశాల్యం కన్నా పెద్దగా ఉన్నట్లు కనపడుతోంది. కొత్త మ్యాప్ దాని అసలు రూపం చూపిస్తోంది. దీంతో అమెరికా ఈ తీర్మాణాన్ని వ్యతిరేకించింది. ఇదిలా ఉంటే కొత్తగా ప్రామాణీకరించిన ‘ఈక్వల్‌ ఎర్త్‌’ వ్యాప్ ప్రకారం ఇతర దేశాలతో పోల్చుకుంటే భూమధ్య రేఖకు కొంత దగ్గరగా ఉన్న భారత్‌ మరింత పెద్దదిగా అసలు రూపంలో దర్శనమిస్తుంది.

కొత్త మ్యాప్ వినియోగంపై ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. అయితే ఈ మద్దతు ప్రపంచ పటంలో ఏ నిర్దిష్ట మార్పులకు గానీ.. జాతీయ సరిహద్దుల చిత్రణకు గానీ ఆమోదం తెలిపినట్లు కాదని స్పష్టం చేసింది.

ఈ పటంలో జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సార్వభౌమ భూభాగాలను భారతదేశ అధికారిక పటం ప్రకారమే చూపించాలి. అందుకు విరుద్ధంగా తప్పుదారి పట్టించే విధంగా చూపించే ఏ చిత్రీకరణ అయినా ఆమోదయోగ్యం కాదంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై భారత్ వైఖరి స్పష్టంగా ఉంటుంది. ఈ విషయంలో రాజీ పడే అవకాశమే లేదు అని స్పష్టం చేశారు. అసలు ప్రపంచ చిత్ర పటాలు ఎలా రూపొందాయి? చరిత్రలోకి వెళ్లితే.. క్రేట్స్ ఆఫ్ మాలస్ అనే గ్రీకు తత్వవేత్త క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో మొదటిసారిగా భూమిని గోళాకారంగా చూపించారు.

కాగాఆధునిక భౌగోళిక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి, అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా ప్రపంచ పటాన్ని తయారు చేసిన మొదటి వ్యక్తి ఎరటోస్తనీస్ . అందుకే ఆయనను "భౌగోళిక శాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు. మనం ప్రస్తుతం చూస్తున్న ప్రపంచ పట రూపకల్పనలో గెరార్డస్ మెర్కేటర్ అనే డచ్ భౌగోళిక శాస్త్రవేత్త పాత్ర చాలా ముఖ్యమైనది.

1569లో ఆయన రూపొందించిన "మెర్కేటర్ ప్రొజెక్షన్" ఆధారంగానే నేటికీ ప్రపంచ పటాలను తయారు చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మాణంతో ఈ మ్యాప్‌కు కూడా కాలం చెల్లి ‘ఈక్వల్‌ ఎర్త్‌’ అందుబాటులోకి రానుంది.

వాస్తవానికి ప్రపంచానికి పరిపూర్ణమైన మ్యాప్ లేదు. భూమి గోళాకారంలో ఉండటం, మ్యాప్ చదునుగా ఉండటం వల్ల ఏదో ఒక అంశంలో రాజీ పడాల్సిందే. మ్యాప్ అంటే కేవలం ఒక ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసుకునే సాధనం మాత్రమే కాదని భౌగోళిక నిపుణులు చెబుతున్నారు.. మ్యాప్ అనేది భూమికి అద్దం కాదు.. భూమిని మనకు అర్థమయ్యేలా చూపించే ఒక విధానం మాత్రమే.

ఏ ప్రొజెక్షన్‌ను ఉపయోగిస్తున్నామన్న దానిపై ప్రపంచం మన కళ్లకు కనిపించే తీరు కూడా మారుతుంది. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాలు కూడా దీనిని స్వీకరించాయి.

ఈ మ్యాప్ ద్వారా ప్రపంచంలోని వివిధ భూభాగాలు నిజంగా ఎంత విస్తీర్ణాన్ని ఆక్రమించాయో ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను కూడా పూర్తిగా లోపాల్లేని మ్యాప్‌గా చూడలేం అంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story