Jordar News: ఎండకు తట్టుకోలేక టబ్ లో స్నానం చేస్తున్న చింటూ
Jordar News: ఎండల తాపం మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ఇబ్బందికరంగా మారింది.
Jordar News: ఎండకు తట్టుకోలేక టబ్ లో స్నానం చేస్తున్న చింటూ
Jordar News: నీళ్ల టబ్బుల మారాజు లెక్కన కూసోని ముద్దుగ జలకాలాడ్తాంది గదా కుక్క.. అని, అనుకునేరుల్ల. పాపం ఈ ఎండకు తాళలేక దిగిందట్ల నీళ్లల్ల. కాశేపిట్ల కూసోని మొఖం కడిగినట్టు గుడ జేశింది. (0.57 దగ్గర) నీళ్లు సల్లగ తాకేటాల్లకు కండ్లు గుడ మూతలేశింది. ఈ ఎండలు సల్లగుండ ఎంత పర్శాన్ జేస్తున్నయి సూడుర్రి మూగజీవులను. మనుషులమైన మనకేంపోయిందుల్ల.. యాటిన్ని శెట్లు కొట్టుకుంట, కూలర్లకింద, ఏసీల కింద పండుకుంట.. సల్లగ కుండల నీళ్లు, ఫ్రిజ్జిల నీళ్లు తాక్కుంట సంవత్సరానికోపారి ఎండకాలన్ని అతి తెల్వితోటి తప్పిచ్చుకుంటున్నం గని, మూగజీవులయితే అల్లాడ్తన్నయుల్ల పాపం.
కుక్కలు అనే గాదు మల్ల.. ఇర్గమ్గ కొడ్తున్న ఈ ఎర్రటెండలు శెయ్యంగ కోళ్లు, కోతులు, ఆవులు, బర్లు, కుక్కలు ఎవ్వైనా.. ఇంత తడి జాగ కనవడంగనే.. నీళ్లు కనవడంగనే ఇట్ల సల్లగ సేదతీర్తుంటయి ఈ ఎండకాలమంత. మనకేమో నచ్చదాయే.. ఆటికేమో తిప్పలాయే. మరి ఏం జేత్తయుల్ల పాపం.. సీత కష్టం సీతది.. పీత కష్టం పీతది అన్నట్టు వేటి తిప్పల వాటియి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ అనేటి ఊరి నుంచి గీ వీడియో పంపిండు మా విలేకరన్న గనుల్ల.. ఈ యాసంగి ఎండలు శెయ్యంగ ఏడ సూశ్న గివ్వే తిప్పలు మూగజీవాలయి. అందుకే జనాలు.. ఈ ఎండకాలమన్ని దినాలు పంటపొలాల కాడ, ఇంటి సుట్టుపక్కల్ల నీళ్ల సౌలతి ఏర్పాటు శేశి, మూగజీవాలకింత ఆసరగాన్రుల్ల. జర్ర మీకు పుణ్యముంది. పెడ్తరు గదా.




