Jordar Varthalu: నమ్మినందుకు 40 లక్షలు బొక్క
Jordar Varthalu: అనంతపురంలో కిలేడీ మోసం! తాను డీఎస్పీనని నమ్మించి ఓ రైతు వద్ద 40 లక్షల రూపాయలు కాజేసిన సరస్వతి అనే మహిళ.
Jordar Varthalu: నమ్మినందుకు 40 లక్షలు బొక్క
Jordar Varthalu: .. మాయమాటలు నమ్మి బోర్లవడ్డమా.. జేబులు ఖాలీ అవుడే. బ్యాంకు బ్యాలెన్సు నిల్లవుడే. ఇవ్వన్ని పోను మీదికెల్లి స్టేషన్ల సుట్టు తిర్గుడు. కోర్టులు, పంచాయితీలు. శిన్నగలెవ్వుల్లా మంది నమ్మినందుకచ్చే సైడ్ ఎఫెక్టులు. అసొంటి సైడ్ ఎఫెక్టులతోనే, 40 లక్షలు బొక్కవెట్టిచ్చుకున్నడు అనంతపురం దిక్కు ఆలమూరు కాడుండే రామానాయుడు. ఈనెకు, వాళ్ల ఊర్లనే ఉండే రంగనాయకులు అనెటాయ్న.. అటు దిక్కు ముద్దినాయనపల్లి కాడుండే సరస్వతిని డీఎస్పీ అని దోస్తాన్ కల్పిచ్చిండట. ఇగామె సాదకబాధకాలు జెప్పుకుంట రామానాయుడు తాన 40 లచ్చలు గుంజిందట. పిలగాండ్ల పానం మంచిగలేదు, సుట్టాల పానం మంచిగలేదనుకుంట ప్రాంసరి నోటు రాపిచ్చుకొని మరీ రానా తాన లచ్చలు పట్టిచ్చిందట. ఇగ కొన్నొద్దులైనంక వడ్డీ పైసలు, అసలు అడుగుతె డీఎస్పీనే పైసలడుగుతవా. అని, రుబాబ్ సూపెడ్తున్నదట. అగో గిదెక్కడి కథ పోలీసోల్లైతే బాకీ పైసలు ఇచ్చుడుండదా ఏందని అసలు ఖాకీలకు ఫిర్యాదు వెడ్తే.. ఈమె మీద కేసు వెట్టిర్రట. ఈమె ఎక్కడ పోలీస్ కొల్వుజేస్తున్నది, ఏం కథ అన్ని అర్సుకునే పన్లెవడ్డరు ఖాకీలు. సూశిర్రా జనాలూ.. ఖాకీలం, ఖాకీసొక్కా ఏసుకున్నం, డీఎస్పీ మా మామ అంటె ఉత్తగ నమ్మి ఆగం గాకుర్రి. బోర్లవడి పైసలు నాశ్నం జేసుకోకుర్రి ఏమంటున్నం.




