Jordar Varthalu: టీ పొడి ఎలా తయ్యారుచేస్తున్నారో చూడండి

Jordar Varthalu: హైదరాబాద్‌లో కల్తీ టీ పౌడర్ తయారీ ముఠా గుట్టురట్టు. ప్రమాదకర రంగులు కలుపుతున్న టీ పౌడర్‌ను ఎలా గుర్తించాలో పోలీసులు వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 24 April 2026 10:49 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: టీ పొడి ఎలా తయ్యారుచేస్తున్నారో చూడండి

Jordar Varthalu: వావ్.. సూశిర్రానుల్లా.. మాంచి ఘుమఘుమలాడే చాయపత్తను నిమిషాల్లనే ఎట్ల తయ్యారైందో. ఇగ ఇదే గాదు.. ఇంకో రెసిపీ గుడ ఉన్నది.. అది గుడ సూడుర్రి. అర్రె.. అల్కగనే జేశిపారేశిండుగదా ఈ అన్న గుడ. మరిగ పోలీసు సార్లు ఇంకో ట్యాలెంటెడ్ మోతెవార్నీ ప్రవేశపెట్టుర్రి.

ఓ వీళ్లను ఎత్కకట్కపోను.. వీళ్లెక్కడ దాపురమయ్యిర్రురా నాయినా. జనాల పాణాలు ఏమైతే మాకేంది మాకచ్చే లాభం మాకత్తె సాలు అన్నట్టే ఉన్నరుగదా ఈ బద్మాష్ గాళ్లు. పట్నంల కల్తీ టీపొడి తయ్యారు జేశే గ్యాంగ్ పెద్దదే ఉన్నదని తెల్శి హెచ్ ఫాస్ట్ పోలీసులు గట్టి నిఘా వెట్టి వీళ్లను దొర్కవట్టిర్రు. 10 మంది నిందుతులను అదుపులకు తీస్కోని వాళ్ల దగ్గరి కెంచి నాలుగు టన్నుల కల్తీ టీపొడి మాలు దొర్కవట్టి సీజ్ జేశిర్రట. వాడిన టీపౌడర్ కే అడ్డగోలు కెమికల్లు, రంగులు కల్పి మల్లా చాయపత్తను తయ్యారు జేస్తున్నరట. ఇగీళ్ల బండారం బట్టబయలైనంక వాళ్లతోనే టీపొడి ఎట్ల తయ్యారు జేస్తరనేది చేసి చూయించిర్రు పోలీసులు. మరిగ దాంట్ల ఏమేం కల్పుతున్నరో ఈ సారు మంచిగ ఇవరించిండు ఇనుండ్రి.

అట్ల తయ్యారుజేశ్న చాయపత్తను రోడ్ల పక్కపొంటి చాయపత్త అమ్ముకునే షాపులల్ల, చిన్నచిన్న చాయ హోటలల్ల అమ్ముతున్నరట. మరిగ కల్తీ చాయపత్తను, మంచి చాయపత్తను ఎట్లా గుర్తువట్టాలనేది గుడ జెప్పిండీ పోలీసు సారు. సూశిర్రుగదా పబ్లిక్కు.. శానా మంది మా చాయపత్త మంచి కలర్ అత్తది. ఎక్కో సేపు మర్గకున్నా మంచి కలర్ ఉంటది, గుమగుమలాడే వాసనత్తదని ముర్శిపోతరుగనీ., దాని ఎన్కాల అసలు మతులబ్ ఎంటిదనేది గుడ ఆలోశన జేస్కోండ్రి. లేకుంటె నాణ్యమైనదే అన్కోని అడ్డగోలు కెమికల్స్, పనికిమాల్న రంగులు కల్పిన కల్తీ చాయపత్తతోని చాయ చేస్కోని తాగే పరిస్థితి ఉంటది. కావట్టి మంచిగ సూస్కోండ్రి మరి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story