Jordar Varthalu: రేసుగుర్రం రీరిలీజుకు గుర్రాలు.. అల్లు అర్జున్ ఫ్యాన్సా మజాకా..!

Jordar Varthalu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'రేసుగుర్రం' రీ-రిలీజ్. సినిమా పేరుకు తగ్గట్టుగా నిజమైన గుర్రాలతో థియేటర్ల వద్దకు చేరుకున్న బన్నీ అభిమానులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 1:15 PM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: రేసుగుర్రం రీరిలీజుకు గుర్రాలు.. అల్లు అర్జున్ ఫ్యాన్సా మజాకా..!

Jordar Varthalu: వీళ్ల ఆగం సల్లగుండ. గిట్లున్నరేంది ఈల్లు. దూరపు ప్రయాణాలకు గుర్రాలను వాడ్తరని ఎన్కటి సుందే సూస్తున్నంకనీ., ప్రయాణ సాధనాలను సిన్మాకెందుకు పట్కరావద్దని ఎరైటీగ ఆలోశన జేశ్నట్టున్నరు గదా గీళ్లు. మరి వీటికి పార్కింగ్ టికెట్ ఉచితమో లేకుంటే.. నాలుగు కాళ్లని ఫోర్ వీలర్ కింద జమకడ్తరో కనీ., ఇడ్శిపెడ్తే సిన్మ గూడ సూపెట్టెతట్టే ఉన్నరు గద వీళ్లు.

ఓశినీ.. అన్నంత పన్జేశిర్రు గదా. గుర్రాలకు సిన్మా ఏం సమజైతదే అన్నలు గిట్ల పట్కచ్చిర్రు. ఆయింత అది అటీటు జేశెనా.. సిన్మా సంబురం ఎటమటమైతది. మరి వీటికి టికెట్ ఎట్ల కొట్టిర్రో.. టికెట్లు శింపెటోల్లు లోపటికెట్ల వంపిర్రో కనీ., టాకీస్ల ఇడ్శెటాలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్సు సంబురం డబులైంది. బన్నీ భాయ్ పుట్టిన బర్తుడే పేర్మీద రేసుగుర్రం సిన్మా రీరిలీజని సిన్మోల్లు వెడ్తే.. ఈతీర్ల ఎంట్రీ ఇచ్చి, సిన్మా టాకీసోల్లకు పెద్ద షాకే ఇచ్చిర్రు ఫ్యాన్స్. మొన్నట్ల ప్రభాస్ అన్న సిన్మాకు బొమ్మ మొసల్లతోని ఎంట్రీ ఇచ్చిర్రు. బాలయ్య సారు ఫ్యాన్స్ సిన్మాల వాడే కత్తులతోని, పుష్పా సిన్మా విలన్ లెక్క గుండుతోని, ఇసొంటి తీర్తీర్ల సీన్లను సిన్మా టాకీస్ల కాడ సూశ్న జనాలకు ఈ గుర్రాల ఎంట్రీ కొత్తగనే ఉందని మస్తు ఖుషీ అయితున్నరు ఫ్యాన్సు. రేసుగుర్రం రీరిలీజుకు గుర్రాలను పట్కచ్చిర్రు కని, నందమూరి నటసింహం సిన్మా.. లక్ష్మీ నర్సింహా రీరిలిజుకుంటె సింహాలనే పట్కచ్చెటోల్లు కావచ్చు. కనీ., రవిబాబు సారు తీశ్న అదుగో సిన్మాకైతే పందులను పట్కపోకుర్రని ఒక్క తీర్గ రెక్వెస్టు జేస్తున్నరు సిన్మా ఫ్యాన్లు. ఏమాటకామాటనే కని, సిన్మాఫ్యాన్లకచ్చిన ఆలోచనలైతే ఈ దున్యా మీద ఎవ్వలకు రావు పోర్రి. వాళ్లకు వాళ్లే పోటీ.. వాళ్లకు వాళ్లే సాటి.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story