“రూ.1000 కోట్ల కాంట్రాక్ట్‌లో రూ.400 కోట్లు అవినీతి”: మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ షాకింగ్ కామెంట్స్
Former IAS PV Ramesh: మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దేశ పరిపాలన వ్యవస్థ, రాజకీయాలు, అవినీతి, కార్పొరేట్ ప్రభావంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Former IAS PV Ramesh: మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దేశ పరిపాలన వ్యవస్థ, రాజకీయాలు, అవినీతి, కార్పొరేట్ ప్రభావంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ప్రభుత్వ వ్యవస్థలో “డీప్ రూటెడ్ సిస్టమిక్ కరప్షన్” పెరిగిపోయిందని అన్నారు.
ప్రజలకు సరైన వైద్యం, విద్య, తాగునీరు, రోడ్లు, భద్రత వంటి ప్రాథమిక సేవలు అందకపోవడానికి రాజకీయ నాయకులు, అధికారులు, కార్పొరేట్ వర్గాల మధ్య ఏర్పడిన అవినీతి సంబంధాలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని డాక్టర్ రమేష్ ఆరోపించారు. ఒక వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టులో దాదాపు 40 శాతం వరకు అవినీతి జరుగుతోందని, రాజకీయ నాయకులు–అధికారులు–కాంట్రాక్టర్లు కలిసి వ్యవస్థను దోచుకుంటున్నారని అన్నారు.
టెండర్ విధానాలను కూడా కొంతమంది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చుతున్నారని, అర్హత ప్రమాణాల నుంచి ప్రాజెక్టుల రూపకల్పన వరకు ప్రభావం చూపుతున్నారని తెలిపారు.




