Jordar Varthalu: గ్యాస్ సిలిండర్లలో నీళ్లు ఎలా నింపుతున్నారో చూడండి
Jordar Varthalu: గ్యాస్ సిలిండర్లలో నీళ్లు నింపుతూ వినియోగదారులను మోసం చేస్తున్న ఒక వ్యక్తి వీడియో లక్నోలో వైరల్‌గా మారింది.
Jordar Varthalu: గ్యాస్ సిలిండర్లలో నీళ్లు ఎలా నింపుతున్నారో చూడండి
Jordar Varthalu: ఎవ్వలు సూత్తలేరు.. కానియ్యే కాక. నీళ్లు ఎక్వయినా మంచిదే గని, గ్యాస్ తక్వ అయ్యేతట్టు సూస్కో. చారణ కర్సుకు బారాణా లాభం తియ్యాలె. ఆ.. గట్ల. వా.. మస్తు కల్పుతాండుల్లో కాక. మందుల నీళ‌్లు కల్పే అల్వాటు బగ్గున్నట్టున్నది గదా. ముద్దుగ కుర్శిల కూసోని, గ్యాస్ బుడ్డి ముంగట పెట్టుకోని బకిట్ల గిలాస ముంచుకుంట ఎంత పొందిగ్గ నీళ్లు నింపుతాండో సూడుర్రి. ఊపి ఊపి కుదిచ్చి కుదిచ్చి పోస్తున్నడు గదా మల్ల.. దొంగ కోళ్లు పట్టేటోని లెక్కన్న ఆటీటు నాసువెట్టి సూస్కుంట ఎవ్వలన్న పశిగడ్తార్రా అని పదే పదే సూస్కుంట గ్యాస్ బుడ్డిల నీళ్లు నింపుడే నింపుడు పో. దినాం గిట్ల ఎన్ని సిలిండరు బుడ్లు నీళ్లతోటి నింపి మంది ముంచుతున్నడో గీ మోతెవరి.. అదును సూశి ఎవ్వలో కిటికీల కెల్లి వీడియో తీశి సోషల్ మీడియాల ఇడ్శేటాళ్లకు మస్తు వైరల్ ఐతాంటె, కఠినచర్యలు తీస్కోవాల్నని కామెంట్లు రాస్తున్నరు కింద. లక్నో పట్నంలనట గిది. నీళ్లు నింపుతున్నోడు ఎవ్వలో గుడ కాదు.. గ్యాస్ డెలివరీ శేశేటోడే ఉన్నట్టున్నడు ఆ డ్రెస్సు, ఆ వాలకం సూత్తాంటె. ఐనా అట్టప్పుడే గ్యాస్ సిలిండర్లల్ల నీళ్లు నింపుతరు కొందరు కక్కర్తిగాళ్లు. ఇగిప్పుడు బొచ్చెడు డిమాండున్నది గావట్టి ఊకుంటరా తాతలు.. ఉషారు పిట్టలయ్యి.. కల్తీ శెయ్య తపించిపోతున్నరు గిట్ల. మరి దీని మీద అధికారులు ఏం చర్యలు తీస్కుంటరో సూడాలె గని, సూత్తార్రు గదా పబ్లిక్కు.. వస్తువు పిరమైనా తిప్పలే ఉన్నది.. వస్తువుకు డిమాండు పెర్గినా తిప్పలే ఉన్నది. కావట్టి గిసోంటి మోసాల పట్ల ప్రజలు శానా జాగర్తగ ఉండాల్నని మా జోర్దార్ వార్తల తర్పున కోరుతున్నమిగ..




