Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ కరెక్షన్.. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? నిపుణుల విశ్లేషణ!

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధరల కరెక్షన్‌కు అసలు కారణాలు ఏమిటి?

Arun Chilukuri
Published on: 21 Oct 2026 3:28 PM IST
Gold and Silver Prices
X

Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ కరెక్షన్.. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? నిపుణుల విశ్లేషణ!

Gold and Silver Prices: గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం మరియు వెండి ధరలు ఒక్కసారిగా వెనక్కి తగ్గుముఖం పట్టాయి. పసిడి ధరల్లో భారీ కరెక్షన్ రావడంతో మదుపరులు, కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా? లేదా మళ్లీ పుంజుకుంటాయా? అనే అంశంపై మార్కెట్ నిపుణులు కీలక విశ్లేషణలు అందిస్తున్నారు.

ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు:

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

భారీగా తగ్గిన సిల్వర్ & గోల్డ్: గత కొద్ది రోజుల్లో వెండి ధర దాదాపు రూ. 35,000 నుండి రూ. 40,000 వరకు పడిపోగా, బంగారం ధర కూడా రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు క్షీణించింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు: అంతర్జాతీయంగా యుద్ధాలు, మార్కెట్ అస్థిరతలు కూడా కమోడిటీ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

మదుపరులు ఏం చేయాలి?:

ప్రముఖ మార్కెట్ నిపుణులు నంది రామేశ్వరరావు మరియు ప్రభు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులు తొందరపడి భారీగా పెట్టుబడులు పెట్టడం కంటే వేచి చూసే ధోరణి అవలంబించడం మంచిదని సూచించారు. లాంగ్ టర్మ్ పెట్టుబడులకు గోల్డ్ ఎప్పుడూ సురక్షితమే అయినప్పటికీ, ప్రస్తుత షార్ట్ టర్మ్ మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో పెట్టుబడులను స్టాక్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ మార్గాల్లో బైఫర్కేట్ చేసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.